Anant Chaturdashi: అనంత చతుర్దశి ఎప్పుడు, గణపతి నిమజ్జన శుభ సమయం, పూజా విధానాన్ని తెలుసుకోండి
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 10.18 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 06.49 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయతిథి ప్రకారం అనంత చతుర్దశి సెప్టెంబర్ 28న జరుపుకుంటారు. గణేష్ నిమజ్జనంతో పాటు, అనంత చతుర్దశి రోజు విష్ణువుకు అంకితం చేయబడింది.
భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి నుండి ప్రారంభమైన గణేష్ ఉత్సవాల వేడుకను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. గణపతి జన్మోత్సవంగా జరుపుకునే ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. చతుర్దశి రోజున వినాయకుడికి వీడ్కోలుపలికి గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశిని అనంత చతుర్దశి అని కూడా పిలుస్తారు. ఈ రోజుతో గణపతి ఉత్సవాలు ముగుస్తాయి. వినాయక చవితి రోజు నుంచి 10 రోజుల పాటు నియమాలతో గణపయ్యను పూజిస్తారు. ఉత్సవాల్లో చివరి రోజున అనంత చతుర్దశి రోజున గణపతిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది గణపయ్య తమ ఇంటికి రావాలని సుఖ సంతోషాలు ఇవ్వాలనే కోరికతో వీడ్కోలు పలుకుతారు.
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 10.18 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 06.49 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయతిథి ప్రకారం అనంత చతుర్దశి సెప్టెంబర్ 28న జరుపుకుంటారు. గణేష్ నిమజ్జనంతో పాటు, అనంత చతుర్దశి రోజు విష్ణువుకు అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున పూజా సమయం 12 గంటల 37 నిమిషాలు ఉండనుంది. అంటే శుభ సమయం ఉదయం 06:12 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06:49 వరకు కొనసాగుతుంది.
గణపతి నిమజ్జనానికి అనుకూలమైన సమయం
గణపతి నిమజ్జనానికి మూడు శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. మొదటిది ఉదయం 06:11 నుండి 07:00 వరకు, రెండవది ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 03:10 వరకు.. మూడవది సాయంత్రం 04:41 నుండి రాత్రి 09:10 వరకు.
హిందూ మతంలో అనంత చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు 14 లోకాలను సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హృదయపూర్వకంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని.. అన్ని వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి అనంత చతుర్దశి రోజున ఉపవాసం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
అనంత చతుర్దశి పూజా విధానం
ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం పూజ గదితో సహా మొత్తం ఇంటిలో గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత పూజా స్థలంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరచి, విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. దీని తరువాత, ధూపం, దీపం, నైవేద్యం, పరిమళం, చందనం సమర్పించి .. మహావిష్ణువుని పూజించి చివరకు హారతి ఇవ్వాలి. మంత్రాలను పఠించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)