Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Transit 2023: త్వరలో తన రాశిని మార్చుకోనున్న రాహువు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్యంలో రాహువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరి జాతకంలోనైనా రాహువు ఆర్థిక వృద్ధి, జీవితంలో పలు మార్పులకు కారకుడుగా పరిగణింపబడుతున్నారు. రాహువు ఈ ఏడాది అక్టోబర్ లో తన రాశిని మార్చుకోనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాశులపై రాహు ప్రభావం చూపించినా ఈ మూడు రాశులకు అదృష్టాన్ని. ఆర్ధిక లాభాలను తీసుకుని వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Rahu Transit 2023: త్వరలో తన రాశిని మార్చుకోనున్న రాహువు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Rahu Transit 2023
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Sep 22, 2023 | 7:36 PM

వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు , కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. రాహు-కేతు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. ప్రతి 18 నెలలకు ఈ రెండు గ్రహాలూ ఒకే సారి తమ రాశులను మార్చుకుంటాయి. రాహువు పాముకి అధిపతి. కనుక రాహు ప్రభావంతో మానసిక, అతిశయోక్తి లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్యంలో రాహువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరి జాతకంలోనైనా రాహువు ఆర్థిక వృద్ధి, జీవితంలో పలు మార్పులకు కారకుడుగా పరిగణింపబడుతున్నారు. రాహువు ఈ ఏడాది అక్టోబర్ లో తన రాశిని మార్చుకోనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాశులపై రాహు ప్రభావం చూపించినా ఈ మూడు రాశులకు అదృష్టాన్ని. ఆర్ధిక లాభాలను తీసుకుని వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మీనరాశిలో రాహువు సంచార ప్రభావం: రాహువును ఛాయా గ్రాహం అంటే నీడ గ్రహం, క్రూర గ్రహం అని అంటారు. అయితే వాస్తవానికి రాహువు కూడా కర్మ ప్రధాతనే. రాహువు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. రాహువు ఈ సంవత్సరం అక్టోబర్ 30న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మూడు రాశులకు చెందిన వ్యక్తులకు  సంబంధించిన భవితవ్యాన్ని మారుస్తుంది.

2023లో రాహు గ్రహం సంచారం ద్వారా తన రాశిని మార్చుకుంటుంది. అక్టోబర్ 30న రాహువు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహువు మేషరాశి నుండి బయటకు వచ్చి మీనరాశిలోకి ప్రవేశించడం వలన కొంతమందికి ప్రయోజనకరం. కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థానం, డబ్బు, కీర్తి ప్రతిష్టలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

రాహు సంచారం వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఈ రాశికి చెందిన వారు చాలా డబ్బు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో మంచి ఫలితాలను పొందుతారు. పదివిలో ఉన్నతి లభించే అవకాశం ఉంది. తమ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయనిపిస్తుంది ఈ రాశివారికి.

రాహువు సంచారం కన్యా రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. భారీ లాభాలను పొందుతారు. చేపట్టిన పని చాలా బాగా సాగుతుంది. కొత్త అవకాశాలు పొందుతారు. జీవితంలో ఆనందం పొందుతారు.

రాహు సంచారం మకర రాశికి వృత్తిలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఒకదాని తర్వాత ఒకటి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తెలివితేటల ఆధారంగా మీరు గొప్ప విజయాలు సాధిస్తారు. జీవితంలో సానుకూలత ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)