AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK: యూకేలో గుండెపోటుతో తెలుగు విద్యార్ధి మృతి.. వెళ్లిన వారం రోజులకే దారుణం .. ఒక్కగానొక్క కొడుకు చివరి చూపుకోసం అల్లాడుతున్న తల్లిదండ్రులు..

ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఏపీకి చెందిన ఓ యువకుడి కలలు కల్లలయ్యాయి. విధి వక్రీకరించి.. అనుకోని పరిస్థితుల్లో వెళ్లిన వారం రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాడు. యూకేలోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ అడ్మిషన్ కన్ఫామ్ కావడంతో జాయిన్ అయ్యేందుకు ఈ నెల 8న లండన్ వెళ్లాడు

UK: యూకేలో గుండెపోటుతో తెలుగు విద్యార్ధి మృతి.. వెళ్లిన వారం రోజులకే దారుణం .. ఒక్కగానొక్క కొడుకు చివరి చూపుకోసం అల్లాడుతున్న తల్లిదండ్రులు..
Nri Student Dead
Surya Kala
|

Updated on: Sep 22, 2023 | 8:28 AM

Share

భవిష్యత్ మీద ఎన్నో కలలతో దేశం కానీ దేశానికి వెళ్తున్న యువత జీవితాలు భద్రమేనా అనిపిస్తుంది గత కొంతకాలంగా జరుగుతున్న దుర్ఘటనలతో.. చదువు, ఉద్యోగం అంటూ అమ్మ నాన్నలను, స్నేహితులను, అయినవాళ్ళని విడిచి విదేశాలకు వెళ్తున్న నేటి యువత ప్రాణాలు భద్రమేనా అంటే.. అనుమానం వేస్తుంది వరస మరణాలతో.. తాజగా యూకేలో మరో తెలుగు విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో.. డెడ్‌బాడీని స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన ఏపీకి చెందిన ఓ యువకుడి కలలు కల్లలయ్యాయి. విధి వక్రీకరించి.. అనుకోని పరిస్థితుల్లో వెళ్లిన వారం రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాడు. యూకేలోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ అడ్మిషన్ కన్ఫామ్ కావడంతో జాయిన్ అయ్యేందుకు ఈ నెల 8న లండన్ వెళ్లాడు. లండన్‌లో దిగిన సుబ్బారావు.. యూనివర్సిటీలో రిపోర్ట్ చేసేందుకు 16న బస్‌లో బయలుదేరాడు. అయితే.. ఐదు గంటల ప్రయాణం తర్వాత కార్డిఫ్‌ నగరంలో దిగగానే గుండెల్లో నొప్పిగా అనిపించడంతో గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని సోడా తాగాడు. కానీ.. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే కుప్పకూలాడు. వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయడంతో వైద్య సిబ్బంది స్పాట్‌కి వెళ్లి పరీక్షించి.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి వస్తాడుకున్న కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు.. రోజులుగా.. సుబ్బారావు మృతదేహం యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ మార్చురీలోనే ఉండటంతో.. తమ కుమారుడిని ఎలాగైనా స్వగ్రామానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చివరి చూపుకైనా నోచుకునే భాగ్యం కల్పించమని మృతుని ఫ్యామిలీ రోదిస్తోంది. మొత్తంగా.. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతూ.. చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్‌ ఎటాక్‌కు గురై అకాల మరణం చెందుతున్నారు. కారణాలు ఏవైనా కొందరు నవ్వుతూ.. నడుస్తూ.. ఆడుతూ.. పాడుతూ.. ఇలా ఆకస్మాత్తుగా కూప్పకూలిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?