AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips For Money: ఆర్ధిక ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు ప్రతిరోజూ ఈ పనులు చేసి చూడండి..

లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందడానికి..  ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒకరు అనేక రకాల జ్యోతిష్య పరిహారాలను చేస్తూనే ఉంటారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల చర్యలు పురాణగ్రంధాల్లో పేర్కొనబడ్డాయి. కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

Astro Tips For Money: ఆర్ధిక ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు ప్రతిరోజూ ఈ పనులు చేసి చూడండి..
Astro Tips For Lakshmi Devi
Surya Kala
|

Updated on: Sep 22, 2023 | 1:58 PM

Share

హిందూ మతంలో సంపదలకు అధిదేవత లక్ష్మిదేవి. సిరి, సంపద, కీర్తి, ఆనందాన్ని అందించే దేవతగా పరిగణించబడుతుంది. అందుకనే సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీ దేవి ఆరాధనకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తులకు సంపద, సుఖ జీవితానికి లోటు ఉండదు. లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందడానికి..  ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒకరు అనేక రకాల జ్యోతిష్య పరిహారాలను చేస్తూనే ఉంటారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల చర్యలు పురాణగ్రంధాల్లో పేర్కొనబడ్డాయి. కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే ప్రవేశ ద్వారం కడగాలి

విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. పరిశుభ్రత ఉన్న ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే భగవంతుడిని స్మరించుకుని ఇంటి ముందు నీటితో శుభ్రం చేయాలి. అనంతరం ముగ్గులతో అలంకరించండి. ఇలా రోజూ చేయడం వలన లక్ష్మదేవి త్వరగా సంతోషపడుతుంది. ఆ ఇంటిలో ఎల్లప్పుడూ  సంతోషం ఆనందం నెలకొంటుంది.

ప్రధాన ద్వారం వద్ద దీపం

ఇంటిలోని ప్రధాన ద్వారానికి ప్రత్యేక స్థానం ఉంది. కనుక ప్రతి రోజూ ఉదయం ఇంటి ముందు ముగ్గు వెయ్యడమే కాదు.. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండి. ఈ పరిహారంతో  లక్ష్మి దేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది. ఆ ఎల్లప్పుడూ సిరి సంపదలకు లోటు లేకుండా అనుగ్రహిస్తుంది.

ఇవి కూడా చదవండి

తులసి ఆరాధన:

లక్ష్మీదేవి, శ్రీ విష్ణువుకు చాలా ప్రీతికరమైనదితులసి. ఈ తులసి మొక్కను నిత్యం పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయం తులసి మొక్కకు నీరు సమర్పించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.

సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి:

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్య భగవానుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించే వారి ఇళ్లు ఆనందం, శ్రేయస్సు, కీర్తితో నిండి ఉంటాయి. సూర్య భగవానునికి ప్రతిరోజూ నీటిని సమర్పించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.

నుదుటిపై కుంకుమ

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజూ ఉదయం పూజ చేసిన తర్వాత కుంకుమని నుదుటిపై కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఉదయం పూజ చేసిన తర్వాత నుదుటిపై తిలకం ధరించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)