Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం వచ్చిన మహిళల పట్ల పోకిరిల అసభ్య ప్రవర్తన.. 54 మందిపై కేసుల నమోదు
ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. ఇక శని,ఆదివారాలలో అయితే భక్తులు పోటెత్తుతారు. లక్షల్లో భక్తులు గణపయ్యను దర్శనం చేసుకుంటారు. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా ఎంత కష్టం ఉన్న సరే క్యూ లైన్స్ లో నిలబడి తమ కోరికలు స్వామి వారికి విన్నవించుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు
దేవాలయంలో భగవంతుడి సన్నిధికి భక్తితోనూ, పాఠశాలకు శ్రద్దాసక్తులతోనూ వెళ్ళమని మన పెద్దలు చెబుతారు. అయితే నేటి సమాజంలో వచ్చిన మార్పుల్లో భాగంగానే లేక వివిధ కారణాల వల్లనో.. చివరికి దైవం అంటే పాపపుణ్యం అనే భీతి లేదు.. చదువు చెప్పే గురువులకు తగిన గౌరవం లేదు. అందుకు ఉదాహరణగా ఎన్నో సంఘటనలు నిలుస్తునే ఉన్నాయి. ఓ వైపు చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటుంటే.. మండపాలను కొందరు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసే వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణేషుడి మండపం వద్ద ఆకతాయిలు బరితెగించారు. భక్తుల ముసుగులో మహిళల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు.. భక్తుల నుండి ఫిర్యాదులు అందడంతో ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా ఉంచాయి. మహిళల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్న 54 మందిని షీ టీమ్స్ అరెస్ట్ చేశారు.. అరెస్ట్ అయిన వారిలో ఆటో డ్రైవర్లు, యువకులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. ఇక శని,ఆదివారాలలో అయితే భక్తులు పోటెత్తుతారు. లక్షల్లో భక్తులు గణపయ్యను దర్శనం చేసుకుంటారు. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా ఎంత కష్టం ఉన్న సరే క్యూ లైన్స్ లో నిలబడి తమ కోరికలు స్వామి వారికి విన్నవించుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా నిత్యం లక్షలాది భక్తులతో ఖైరతాబాద్ గణేష్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అన్ని శాఖల సమన్వయం తో ఏర్పాట్లు చేసిన అధికారులు.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
వినాయక చవితి రోజు నుంచే ఖైరతాబాద్ లో కొలువైన గణపయ్యను దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూనే ఉన్నారు. నిత్యం భక్తుల తాకిడి పెరుగుతూ ఉండడంతో ఇదే అదునుగా భావించిన ఆకతాయులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు మహిళలు. మఫ్తి లో పోలీసులు ఉన్నా ఏ మాత్రం భయం లేకుండా ఆకతాయిలు విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికి 54 మంది పోకిరీలను షి టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఆటో డ్రైవర్లు తో సహా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. వరుస ఫిర్యాదులతో ఖైరతాబాద్ గణేష్ వద్ద మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అత్యవసరం అయితే డైల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి అని కోరారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనం ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..