Rameshwaram: రామసేతు మాత్రమే కాదు సీతారాములు పూజించిన శివయ్య సహా అనేక ప్రదేశాలు.. అక్టోబర్ టూర్ కు బెస్ట్ ఎంపిక..

తమ భవబంధాలను.. విడిచిపెట్టి శాంతి, మోక్షాన్ని వెతుకుతూ ఇక్కడికి వస్తారు. వేగవంతమైన జీవితానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునేవారికి.. దైవానికి దగ్గరగా జీవించాలనేవారికి రామేశ్వరం మంచి ఎంపిక. శ్రీలంకలోని మన్నార్ నుంచి రామేశ్వరం వరకు కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే. మన్నార్ .. రామేశ్వరం మధ్య రామసేతు వంతెన ఉందని హిందువుల నమ్మకం.

Rameshwaram: రామసేతు మాత్రమే కాదు సీతారాములు పూజించిన శివయ్య సహా అనేక ప్రదేశాలు.. అక్టోబర్ టూర్ కు బెస్ట్ ఎంపిక..
Rameshwaram
Follow us

|

Updated on: Sep 23, 2023 | 10:52 AM

రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక అందమైన ద్వీప నగరం. ఈ దీవిని పాంబన్ ద్వీపం అని కూడా అంటారు. ఈ ప్రదేశం తమిళంలో ఇరోమేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ఒక నగరం. హిందూ మతానికి చెందిన నాలుగు అత్యంత పవిత్రమైన ధామ్‌లలో ఒకటి ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. తమ భవబంధాలను.. విడిచిపెట్టి శాంతి, మోక్షాన్ని వెతుకుతూ ఇక్కడికి వస్తారు. వేగవంతమైన జీవితానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునేవారికి.. దైవానికి దగ్గరగా జీవించాలనేవారికి రామేశ్వరం మంచి ఎంపిక. శ్రీలంకలోని మన్నార్ నుంచి రామేశ్వరం వరకు కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే. మన్నార్ ..  రామేశ్వరం మధ్య రామసేతు వంతెన ఉందని హిందువుల నమ్మకం. సీతాదేవి కోసం లంకా నగరానికి వెళ్లే సమయంలో సముద్రం మీద సేతు నిర్మించినట్లు  రామాయణంలో ఉందని నమ్ముతారు. రామేశ్వరంలోని కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

రామేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు రామేశ్వరంలో పర్యాటక ప్రదేశాలకు కొరత లేనప్పటికీ.. అయితే తక్కువ సమయంలో ప్రధానమైన, ఉత్తమ దేవాలయాలను సందర్శించాలని కోరుకుంటారు. అటువంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు  మైమరిచిపోతారు.

రామనాథస్వామి దేవాలయం

ఇవి కూడా చదవండి

రామేశ్వరంలోని ప్రసిద్ధ ఆలయాల్లో రామనాథస్వామి దేవాలయం ఒకటి. శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం దాని అందంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడు తన చేతులతో ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే, శ్రీ రాముడు హనుమంతుడిని శ్రీలంక నుండి శివలింగాన్ని తీసుకురావాలని కోరాడని.. అయితే హనుమంతుడు లింగాన్ని తీసుకుని రావడం ఆలస్యం కావడంతో సీత దేవి తన చేతులతో శివలింగాన్ని నిర్మించిందని, దానిని శ్రీరాముడు పూజించాడని..  తరువాత ప్రసిద్ధి చెందినది. అక్కడ ఆలయాన్ని నిర్మించారు.

ధనుష్కోడి బీచ్

ధనుష్కోడి బీచ్ రామేశ్వరం ద్వీపంలోని తూర్పు భాగంలో ఉన్న ఒక ప్రసిద్ధ బీచ్. ఈ ప్రదేశం సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు అనేక రకాల నీటిని ఆస్వాదించవచ్చు. 1964 లో వచ్చిన  భయంకరమైన తుఫాను ఈ మొత్తం గ్రామాన్ని నాశనం చేసింది. అందుకే ఈ గ్రామాన్ని దయ్యాల గ్రామం అని కూడా అంటారు.

రామసేతు

రామసేతు వంతెనను శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి నిర్మించింది. ఈ విషయం తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. రామాయణంలో కూడా ప్రస్తావన ఉంది. ఈ వంతెనను లంకలో యుద్ధ సమయంలో నిర్మించారు. వానర సైన్యం .. సముద్రంపై రాయిని వేసే ముందు శ్రీరాముడిని రాశారని.,అప్పుడు ఆ రాళ్లు  నీటిలో మునిగిపోలేదని అలా రాళ్లను ఉపయోగించి ఈ వంతెనను నిర్మించారు.

రామేశ్వరం ఎలా చేరుకోవాలి? విమాన మార్గంలో – రామేశ్వరం నుండి 174 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురై విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలి. ఇది రామేశ్వరానికి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత, మీరు టాక్సీ లేదా బస్సులో రామేశ్వరం వెళ్లవచ్చు.

రైలు ద్వారా – రామేశ్వరం రైల్వే స్టేషన్ అనేక పెద్ద నగరాలతో మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. చెన్నై, మదురై, కోయంబత్తూరు వంటి ప్రాంతాల నుండి రైలులో ప్రయాణించి రామేశ్వరానికి సులభంగా వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం – రామేశ్వరం ఇతర నగరాలతో మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. మీరు భారతదేశంలోని ఏ ప్రదేశం నుండి అయినా కారు లేదా బస్సులో సులభంగా రామేశ్వరం చేరుకోవచ్చు.

రామేశ్వరం సందర్శించడానికి ఉత్తమ సమయం మీరు రామేశ్వరం అందాలను ఆస్వాదించాలను చూడాలనుకుంటే, శీతాకాలం ఉత్తమమైనది. ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్య ఉంటుంది. ఈ కాలంలో, ఇక్కడ ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల మధ్య ఉంటుంది, ఇది ప్రయాణానికి ఉత్తమ ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం