AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: టీవీ చూస్తున్నప్పుడు మన ముఖం ఏ దిశలో ఉండాలో తెలుసా.. వాస్తు శాస్త్రం ఏం చెప్పిదంటే..

టీవీ చూస్తున్నప్పుడు, ఆహారం తినేటప్పుడు, ఫర్నిచర్ ఉంచేటప్పుడు సరైన దిశను ఎంచుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. దీంతో ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని.. కుటుంబంలోని వ్యక్తులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని.. మనం వాస్తు శాస్త్ర నియమాలను పాటించకపోతే.. అది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. కాబట్టి ఈ వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలి.

Vastu Tips: టీవీ చూస్తున్నప్పుడు మన ముఖం ఏ దిశలో ఉండాలో తెలుసా.. వాస్తు శాస్త్రం ఏం చెప్పిదంటే..
Watching Tv
Sanjay Kasula
|

Updated on: Sep 24, 2023 | 6:51 AM

Share

వాస్తు శాస్త్రం అనేది ఇంటి వాతావరణాన్ని శుభప్రదంగా మార్చడానికి ఒక పురాతన జ్ఞానం-శాస్త్రం. దీని ప్రకారం, ఇంట్లో సానుకూల శక్తిని ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిదానికీ సరైన స్థలం, దిశ ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ఈ తప్పులు మీ శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

వాస్తు శాస్త్రం అంటే మన ఉంటున్న స్థలంలోకి సరిగ్గా గాలి, వెలుతురు ప్రవేశించడమే.. సరిగ్గా గాలి, వెలుతురు వచ్చినట్లైతే అక్కడ నివసిస్తున్నవారు కానీ.. అక్కడ ఉన్నవారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం గాలి, వెలుతురుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

టీవీని ఏ దిశగా కూర్చుని చూడవచ్చు..

టీవీ చూసేటప్పుడు మన ముఖం దక్షిణ దిశలో ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీంతో మనం సరైన మార్గంలో పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

తినేటప్పుడు దిశ:

తినేటప్పుడు సరైన దిశను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఆహారం తీసుకునేటప్పుడు.. మన ముఖం తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల మనకు సరైన శక్తి లభిస్తుంది. అలా చేయకపోవడం వాస్తు శాస్త్రాల ప్రకారం సరికాదని సూచిస్తుంది. దీని కారణంగా మీరు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఫర్నిచర్ ఉంచే సరైన దిశ:

వాస్తు శాస్త్రం ప్రకారం.. తేలికపాటి ఫర్నిచర్ ఉత్తర లేదా తూర్పు దిశలో, భారీ ఫర్నిచర్ దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఇది ఇంట్లో సమతుల్యతను కాపాడుతుంది. ఆర్థిక పరిస్థితిని కూడా బలపరుస్తుంది. మీరు దానిని ఎదురుగా ఉంచినట్లయితే.. ఇంట్లో ప్రతికూల శక్తి.. అంటే నెగిటివ్ ఎనర్జీ  ఏర్పడుతుంది.

ఫర్నీచర్ కొనడానికి సమయం:

మంగళ, శని, అమావాస్య రోజుల్లో ఫర్నీచర్ లేదా కలపను కొనకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రోజుల్లో ఫర్నిచర్ కొనడం సరికాదని సూచిస్తుంది. అలాగే, మీరు ఫర్నీచర్ కొనుగోలు చేసినప్పుడు, అది తయారు చేయబడిన చెక్క రకంపై మీరు శ్రద్ధ వహించాలి. టేకు, చందనం, వేప, అశోక, సగ్వాన్, సాల్, అర్జున్ వంటి శుభ ఫలితాలను ఇచ్చే చెట్ల నుంచి కలపను ఎంచుకోవాలి. ఇది మీ శారీరక, మానసిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. TV9 NEWS దీన్ని ధృవీకరించలేదు.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి