Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం.. నీటిపై తేలియాడే మసీదు.. ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ఈ ప్రాజెక్ట్ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దుబాయ్‌లో సందర్శకుల సంఖ్యను పెంచడానికి చేస్తున్న కృషిలో భాగమే అంటున్నారు. మసీదు మూడు-అంతస్తుల నిర్మాణం, విలక్షణమైన లక్షణంతో ఉంటుంది. ప్రార్థనా మందిరం నీటి అడుగున ఉంటుంది. 50 నుంచి 75 మంది వరకు భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు.

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం.. నీటిపై తేలియాడే మసీదు.. ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Underwater Floating Mosque
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2023 | 2:43 PM

దుబాయ్ వాటర్ కెనాల్‌లో 5.5 కోట్ల దిర్హామ్‌ల వ్యయం అంటే సుమారు రూ. 125 కోట్లతో నీటిపై తేలియాడే మసీదును నిర్మించనుంది. వచ్చే ఏడాది మసీదును సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (ఐసీఏడీ) అధికారులు తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తొలిసారిగా నీటిపై తేలియాడే మసీదును నిర్మించాలని యూఏఈ ప్రకటించింది. ఈ మసీదులో ఈ మసీదులో మూడు అంతస్తులు ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఎమిరేట్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ సౌజన్యంతో దుబాయ్ వాటర్ కెనాల్ వద్ద ఈ ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దుబాయ్‌లో సందర్శకుల సంఖ్యను పెంచడానికి చేస్తున్న కృషిలో భాగమే అంటున్నారు.

మసీదు మూడు-అంతస్తుల నిర్మాణం, విలక్షణమైన లక్షణంతో ఉంటుంది. ప్రార్థనా మందిరం నీటి అడుగున ఉంటుంది. 50 నుంచి 75 మంది వరకు భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది ఎమిరేట్‌లో ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారుతుందని, ప్రార్థనల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న నీటిలో తేలియాడే ప్రార్థనా మందిరాన్ని సందర్శించేందుకు సందర్శకులను స్వాగతిస్తుంది దుబాయ్‌.

ఈ మసీదు నీటిపై రెండు అంతస్తులను కలిగి ఉంటుంది, ఇస్లామిక్ ఉపన్యాసాలు, వర్క్‌షాప్‌ల కోసం ఒక హాలును ఏర్పాటు చేశారు.. వచ్చే ఏడాది సందర్శకుల కోసం దీన్ని తెరవనున్నారు. ముఖ్యంగా, ఈ తేలియాడే మసీదు అన్ని మతాల ప్రజలకు ఆహ్వానం పలికేలా ఉంటుంది. సందర్శకులు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని, ఇస్లామిక్ ఆచారాలను గౌరవించాలని అభ్యర్థించారు. ముఖ్యంగా మహిళలు తల, దుస్తుల విషయంలో పలు సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.