Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మృతదేహన్ని ముక్కలుగా నరికేసి తల్లిదండ్రులకు వార్నింగ్‌..

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న హర్దీప్ సింగ్ కు అదే ప్రాంతానికే చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీతో చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇద్దరిపైన ఇప్పటికే పలు కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు భయపడి తన కుమారుడు ఇంటికి దూరంగా ఉంటున్నాడని దీప తండ్రి గుర్నామ్‌ సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే..

కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మృతదేహన్ని ముక్కలుగా నరికేసి తల్లిదండ్రులకు వార్నింగ్‌..
Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2023 | 1:22 PM

పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువ కబడ్డీ ప్లేయర్‌ ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో కబడ్డీ ప్లేయర్‌ ముక్కలుగా నరికి చంపేశారు దుండగులు. మృతదేహం ముక్కలను అతడి ఇంటి ముందే విసిరేసి, కుటుంబ సభ్యులకు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ షాకింగ్‌ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన కొద్దిరోజుల క్రితం కపుర్తలాలోని ధిల్వాన్ తహసీల్‌ పరిధిలో జరిగింది. కపుర్తలాలోని ధిల్వాన్ తహసీల్‌లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. చనిపోయిన వ్యక్తి హర్దీప్ సింగ్ అలియాస్ దీపగా గుర్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో పంజాబ్ జంగిల్ రాజ్ గామారిందని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ మండిపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. భయానక సంఘటనలో కబడ్డీ ప్లేయర్‌ మృతదేహాన్ని ముక్కలుగా నరికి అతని ఇంటి ముందే విసిరేసారు. ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ తీవ్రంగా ఖండించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధిల్వాన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న హర్దీప్ సింగ్ కు అదే ప్రాంతానికే చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీతో చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇద్దరిపైన ఇప్పటికే పలు కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు భయపడి తన కుమారుడు ఇంటికి దూరంగా ఉంటున్నాడని దీప తండ్రి గుర్నామ్‌ సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీపపై దాడి చేయడానికి అదును కోసం చూస్తున్న ప్రత్యర్థులు అతడు ఇంటికి వచ్చాడన్న సమాచారంతో దాడికి తెగపడ్డారు. బ్యాంకు పాస్‌బుక్ కోసం ఇంటికి వచ్చిన తన కుమారుడిపై దుండగులు దాడి చేశారని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 19 రాత్రి 10.30 గంటల సమయంలో తలుపులు బాదుతున్న శబ్దం వినబడింది.. అనుమానం వచ్చి తను, తన భార్య కలిసి టెర్రస్‌ పైకి వెళ్లి చూశామని చెప్పాడు.. మమ్మల్ని చూడగానే హ్యాపీతో అక్కడే ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు గట్టిగా అరుపులు, కేకలు వేస్తూ.. .మీ కొడుకుని చంపేశామని చెప్పారు… అతడి పనైపోయిందని… ఇదిగో సింహం లాంటి మీ కొడుకు అంటూ హర్ధిప్‌ మృతదేహాన్ని ఇంటి ముందే పడేసి పారిపోయారని పోలీసులకు వివరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కులదీప్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. హ్యాపీ, అతని ఐదుగురు గుర్తుతెలియని సహచరులపై హత్య కేసు నమోదు చేయబడింది. వారిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్టుగా తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..