Comedian Bablu: ‘ఆర్య’ సినిమా బబ్లూ గుర్తున్నాడా ?.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోస్ సినిమాల్లో నటించాడు. కానీ ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. కొంతకాలం అతను ఎక్కడా కనిపించలేదు. ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు తాను ఎందుకు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది ?.. ఫ్యామిలీ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు బబ్లూ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు కమెడియన్ బబ్లూ. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో బన్నీ స్నేహితుడిగా కనిపించాడు బబ్లూ. అలాగే తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. అటు వెండితెర పై.. ఇటు బుల్లితెరపై పేరు సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోస్ సినిమాల్లో నటించాడు. కానీ ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. కొంతకాలం అతను ఎక్కడా కనిపించలేదు. ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు తాను ఎందుకు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది ?.. ఫ్యామిలీ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు బబ్లూ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బబ్లూ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని.. దీంతో తాను డిప్రెషన్‍లోకి వెళ్లిపోయినట్లు తెలిపాడు. 2012లో తండ్రి మరణం.. ఆ తర్వాత 2022లో అనారోగ్యంతో చెల్లెలు చనిపోవడం.. ఈ ఏడాది జనవరిలో తన మేనత్త కొడుకు చనిపోవడంతో చాలా రోజు ఆ బాధ నుంచి కోలుకోలేకపోయానని అన్నారు.
ఆ సమయంలో బ్యాంకాక్ వెళ్లి అక్కడ డీజేగా వర్క్ చేశానని.. ప్రస్తుతం ఓ ఫిల్మ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాని అన్నారు. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానని అన్నారు. అలాగే తాను సొంత ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు తెలిపారు. బబ్లూ అసలు పేరు సదానంద్. 5 ఏళ్ల వయసులోనే ముద్దుల మేనల్లుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత వరుసగా బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమాలో నటించాడు. ఈ మూవీ తర్వాత అతనికి అవకాశాలు క్యూకట్టాయి. చాలా కాలం వెండితెరపై సందడి చేసిన బబ్లూ.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు బబ్లూ. అలాగే త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు బబ్లూ. అలాగే త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.