Rashmika Mandanna: రష్మికను ఇప్పటివరకు ఇలా చూసుండరు.. ‘యానిమల్’ నుంచి ఫస్ట్ లుక్ సూపర్ అంతే..
లీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో గ్రామీణ అమ్మాయి శ్రీవల్లి పాత్రలో కనిపించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో నార్త్ లో రష్మికకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూకట్టాయి. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాల్లో నటించిన రష్మిక ప్రస్తుతం యానిమల్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో మొదలైన రష్మిక సినీ ప్రయాణం ఇప్పుడు ఉత్తరాదికి చేరింది. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. టాలీవుడ్ లో పుష్ప సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో గ్రామీణ అమ్మాయి శ్రీవల్లి పాత్రలో కనిపించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో నార్త్ లో రష్మికకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో హిందీలో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూకట్టాయి. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాల్లో నటించిన రష్మిక ప్రస్తుతం యానిమల్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శనివారం ఈ చిత్రం నుంచి రష్మిక పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను షేర్ చేశారు. కాసేపటి క్రితం విడుదలైన రష్మిక పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇదివరకు రష్మిక ఇలాంటి లుక్ లో కనిపించలేదు. యానిమల్ సినిమాలో గృహిణి పాత్రలో నటిస్తున్నట్లుగా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. తెలుపు, ఎరుపు రంగుల చీరలో.. మెడలో నల్లపూసల తాళి బొట్టుతో అచ్చం మరాఠీ స్త్రీగా కనిపిస్తోంది రష్మిక. ఇందులో తన పాత్ర పేరు గీతాంజలి అని చెబుతూ తన పోస్టర్ షేర్ చేసింది రష్మిక.
Your Geetanjali. ❤️#Animal #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries… pic.twitter.com/AGhexxDIHn
— Rashmika Mandanna (@iamRashmika) September 23, 2023
తన లేటేస్ట్ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది రష్మిక. ఆమె పోస్టర్ చూసి విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో మహిళా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల అనిల్ కపూర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.