AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ట్యాక్సీ డ్రైవర్‌.. అకౌంట్‌లో హఠాత్తుగా రూ.9000కోట్లు జమ.. ఎక్కడివంటే..!

ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఫస్ట్‌ చూడగానే.. అందులో అన్ని సున్నాలే కనిపించటంతో తాను ఆ మొత్తాన్ని లెక్కించలేకపోయానని చెప్పాడు.. రాజ్‌ కుమర్‌ ఖాతాలో డబ్బు డిపాజిట్ కావటంతో.. అతడు తన స్నేహితుడి ఖాతాకు రూ. 21,000 ట్రాన్సఫర్‌ చేశాడు. దాంతో విషయం గ్రహించిన బ్యాంక్‌ అధికారులు..

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ట్యాక్సీ డ్రైవర్‌.. అకౌంట్‌లో హఠాత్తుగా రూ.9000కోట్లు జమ.. ఎక్కడివంటే..!
Cab Driver Account
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2023 | 9:45 AM

Share

బ్యాంకు అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒకరి ఖాతాలో జమకావాల్సిన నగదు వేరొకరి అకౌంట్‌లో పడుతుంటుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఖాతాలో అకస్మాత్తుగా కోట్ల కొద్ది రూపాయల డబ్బు జమైంది. అది చూసి అతనికి మైండ్ బ్లాక్ అయినంత పనైంది. హఠాత్తుగా అతని అకౌంట్‌లో జమ అయిన నగదు ఒకటీ, రెండు కాదు.. మొత్తం రూ.9000 కోట్లు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 9000 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఆ తర్వాత వెంటనే దాన్ని బ్యాంకు వెనక్కి తీసుకుంది. పళని సమీపంలోని నిక్కర్‌పట్టి గ్రామంలో నివసిస్తున్న రాజ్‌కుమార్‌ ఖాతాలోకి కోట్లాది రూపాయలు వచ్చినట్లు సమాచారం అందడంతో షాక్‌కు గురయ్యాడు. సెప్టెంబరు 9న మధ్యాహ్నం 3 గంటలకు అతడి ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసిన అతడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు..

ట్యాక్సీ డ్రైవర్‌ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు.. రోజంతా పనిచేసి అలిసిపోయిన రాజ్‌కుమార్‌.. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయాడు. ఈ క్రమంలోనే అతని మొబైల్‌కు మెజేస్‌ వచ్చింది.. తనకు అకౌంట్‌ కలిగి ఉన్న తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ నుండి నా ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఫస్ట్‌ చూడగానే.. అందులో అన్ని సున్నాలే కనిపించటంతో తాను ఆ మొత్తాన్ని లెక్కించలేకపోయానని చెప్పాడు.. అయితే, ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో జమ అయిన డబ్బును డిపాజిట్ చేసిన మొత్తాన్ని బ్యాంకు విత్‌డ్రా చేసిందని చెప్పాడు.

ఆ మర్నాడే.. బ్యాంకు అధికారులు సెప్టెంబర్ 10న ఆ వ్యక్తిని సంప్రదించి అకౌంట్‌లోంచి ఎక్కువ డబ్బు తీసుకోవద్దని అభ్యర్థించారు. అయితే, రాజ్‌కుమార్ రఖత్ ఖాతాలో డబ్బు జమ చేయాల్సి ఉండగా, చిన్న పొరపాటు వల్ల ట్యాక్సీ డ్రైవర్‌ ఖాతాలో రూ.9000కోట్లు జమైనట్టుగా బ్యాంక్‌ అధికారులు చెప్పారు. రాజ్‌ కుమర్‌ ఖాతాలో డబ్బు డిపాజిట్ కావటంతో.. అతడు తన స్నేహితుడి ఖాతాకు రూ. 21,000 ట్రాన్సఫర్‌ చేశాడు. దాంతో విషయం గ్రహించిన బ్యాంక్‌ అధికారులు ఆ వెంటనే.. 30 నిమిషాల వ్యవధిలో బ్యాంక్ అతని ఖాతా నుండి బ్యాలెన్స్ విత్‌డ్రా చేసింది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, తాను అందులోంచి ఇప్పటివరకు విత్‌డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్‌ అధికారులు వెసులుబాటు కల్పించారు. పైగా, తనకు బ్యాంకు కారు లోన్‌ కూడా ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా రాజ్‌కుమార్‌ చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే