AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ చంద్రయాన్‌-3లో ల్యాండ్‌ అయిన లంబోధరుడు.. ఇక్కడ మెట్రో ఎక్కిన ఏకదంతుడు..!

పది రోజులపాటు సాగే ఈ పండుగలో అయోధ్య రామమందిరం, చంద్రయాన్‌-3, ఇండిగో విమానంలో కూడా వినాయక విగ్రహలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వందేభారత్‌ రైల్లో ఎక్కాడు ఆ ఏకదంతుడు.. ముంబయిలోని ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ఓ భక్తుడు ఏర్పాటు చేసిన ఈ వెరైటీ వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అక్కడ చంద్రయాన్‌-3లో ల్యాండ్‌ అయిన లంబోధరుడు.. ఇక్కడ మెట్రో ఎక్కిన ఏకదంతుడు..!
Metro Themed Ganesh Pandal
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2023 | 7:08 AM

Share

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. ఊరురా, వాడవాడలా బొజ్జగణపయ్యల ప్రతిమలు శోభాయమానంగా కొలువుదీరాయి. ప్రత్యేకంగా రూపొందించిన మంటపల్లో గణనాథుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో కూడా వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకుని.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల అలంకరణలో పలుచోట్ల భక్తులు తమ క్రియేటివిటీనీ ప్రదర్శిస్తున్నారు. పది రోజులపాటు సాగే ఈ పండుగలో అయోధ్య రామమందిరం, చంద్రయాన్‌-3, ఇండిగో విమానంలో కూడా వినాయక విగ్రహలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వందేభారత్‌ రైల్లో ఎక్కాడు ఆ ఏకదంతుడు.. ముంబయిలోని ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ఓ భక్తుడు ఏర్పాటు చేసిన ఈ వెరైటీ వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వినాయక ఉత్సవాలకు ముంబై నగరం అత్యంత ప్రసిద్ధి. ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో ముంబై మెట్రో థీమ్ ఆధారంగా గణేష్ మండపాన్నిఏర్పాటు చేశారు. ఘాట్‌కోపర్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ వరియా అనే యువకుడు తమ ఇంట ప్రతిష్టించినన వినాయకుడిని మెట్రో రైలు ఎక్కించాడు. ముంబయి నగర రవాణా వ్యవస్థకు కృతజ్ఞతగా రాహుల్‌ ఈమెట్రో గణపతిని తయారు చేశాడు. న్యూస్‌ పేపర్లు, పేపర్‌ స్ట్రాలు, సన్‌బోర్డు పూర్తి మట్టి గణపతితితో తయారు చేశానని పట్టభద్రుడైన రాహుల్‌ తెలిపాడు. మెట్రో గణపతిని తిలికించేందుకు భక్తులు ఆ ఇంటికి తరలివస్తున్నారు. మ

మెట్రో థీమ్‌ గణపతి మండపాన్ని సిద్ధం చేయడానికి రాహుల్‌కి నెల రోజుల సమయం పట్టిందని చెప్పాడు. గత 12 ఏళ్లుగా తాను విశేష గణపతి విగ్రహలు, మండపాలను తయారు చేస్తున్నట్టుగా చెప్పాడు.. మూడేళ్లుగా మినియేచర్‌ కాన్సెప్ట్‌తో గణపతిని తయారు చేస్తున్నానని చెప్పాడు… ఈ ఏడాది ఘట్‌కోపర్‌ మెట్రో స్టేషన్‌కు ప్రతిరూపాన్ని తయారుచేశామని చెప్పాడు.. ప్రతి ఏడాది ఒక్కో రకంగా చేస్తామని అన్నాడు… ఇంతకుముందు డబుల్ డెక్కర్ బస్సు, లోకల్ రైలు ప్రతిరూపాన్ని తయారు చేసినట్టుగా చెప్పాడు. కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే ఈ విగ్రహాన్ని తయారు చేస్తామన్నారు. దానిని తయారు చేయడానికి వాళ్లకు ఒక నెలరోజుల సమయం పట్టిందని అని రాహుల్ గోకుల్ వారియా చెప్పారు. ఇకపోతే, రాహుల్‌ తయారు చేసిన మెట్రో కోచ్‌లో కూర్చున్న ఆ గణనాధుడిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. మెట్రో థీమ్ తో తయారు చేసిన వినాయక మండపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. రాహుల్ చేసిన థీమ్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..