యూట్యూబర్‌ బైక్‌ స్టంట్‌ బెడిసి కొట్టింది.. ఎగిరి ఎక్కడోపడ్డాడు.. వైరలవుతున్న వీడియో..

వైరల్‌ వీడియోలో.. ఓవర్‌స్పీడ్‌తో వెళ్తున్న బైక్‌ సర్వీస్‌ రోడ్డుపై స్టంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సర్వీస్ రోడ్డుకి ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. వెనుక నుంచి కారు కూడా వస్తుండటం వీడియోలో మనం చూడొచ్చు. యూట్యూబర్ ముందు టైర్‌ను పైకిలేపి స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ, అతని ప్రయత్నం అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది.. అతను బ్యాలెన్స్ కోల్పోయాడు..

యూట్యూబర్‌ బైక్‌ స్టంట్‌ బెడిసి కొట్టింది.. ఎగిరి ఎక్కడోపడ్డాడు.. వైరలవుతున్న వీడియో..
Youtuber Ttf Vasan Injured
Follow us

|

Updated on: Sep 22, 2023 | 7:12 PM

తమిళనాడులో సెప్టెంబర్ 17 ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తమిళనాడు కాంచీపురం సమీపంలో జరిగిన బైక్ స్టంట్‌లో యూట్యూబర్ టిటిఎఫ్ వాసన్ గాయపడ్డారు. తెలిసిన సమాచారం మేరకు.. యూట్యూబర్ కాంచీపురం జిల్లా సమీపంలోని చెన్నై-బెంగళూరు హైవేలోని సర్వీస్ రోడ్డు వద్ద బైక్ స్టంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ, పాపం బైక్ స్టంట్ అదుపు తప్పి మోటోలాగర్ గాయపడ్డాడు. యూట్యూబర్ టూవీలర్‌ బ్యాలెన్స్ తప్పి ప్రమాదానికి గురైన 0ఖచ్చితమైన ప్రదేశం కాంచీపురం జిల్లా సమీపంలోని బాలుచెట్టి చతిరంగా తెలిసింది. . ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో.. ఓవర్‌స్పీడ్‌తో వెళ్తున్న బైక్‌ సర్వీస్‌ రోడ్డుపై స్టంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సర్వీస్ రోడ్డుకి ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. వెనుక నుంచి కారు కూడా వస్తుండటం వీడియోలో మనం చూడొచ్చు. యూట్యూబర్ ముందు టైర్‌ను పైకిలేపి స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ, అతని ప్రయత్నం అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది.. అతను బ్యాలెన్స్ కోల్పోయాడు.. బైక్ నేరుగా రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. దాంతో యూట్యుబర్‌ ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు.. బైక్ పరిస్థితిని వీడియోలో స్పష్టం చూపించారు.

ఇవి కూడా చదవండి

జరిగిన ప్రమాదంలో యూట్యుబర్‌ టీటీఎఫ్‌ వాసన్‌కు గాయాలయ్యాయి. దాంతో అతన్ని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, టిటిఎఫ్ వాసన్ ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలకు గురికావటం, వార్తల్లో ఉండటం ఇదేం మొదటిసారి కాదు, ఎందుకంటే అతను గతంలో కూడా ఓవర్ స్పీడ్ కారణంగా గతంలో కూడా ప్రమాదానికి గురైనట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..