Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు ఎక్కువగా తాగే వారు… జాగ్రత్త..! సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువే..!! తెలిస్తే షాక్‌ అవుతారు..

రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాస్‌ పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే ఓవరాల్ గా పాలు పరిపూర్ణ డైట్. అందుకే పిల్లలు సహా పెద్దలు కూడా రోజుకు ఒక గ్లాస్‌ పాలు తాగాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ పాలు తాగడం వల్ల ప్రయోజనాలకు బదులు హాని కలుగుతుందని మీకు తెలుసా? పాలు ఎక్కువ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలుఏంటో ఇక్కడ తెలుసుకుందాం...

పాలు ఎక్కువగా తాగే వారు... జాగ్రత్త..! సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువే..!! తెలిస్తే షాక్‌ అవుతారు..
Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2023 | 5:14 PM

పాలు సంపూర్ణ ఆహారం అని మనందరికీ తెలిసిందే. పాలతో ఎముకలకు కావాల్సిన కాల్షియం సహా.. విటమిన్ డి, బి కాంప్లెక్స్, ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. ఒక గ్లాసు పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని సూచిస్తుంటారు. రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాస్‌ పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే ఓవరాల్ గా పాలు పరిపూర్ణ డైట్. అందుకే పిల్లలు సహా పెద్దలు కూడా రోజుకు ఒక గ్లాస్‌ పాలు తాగాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ పాలు తాగడం వల్ల ప్రయోజనాలకు బదులు హాని కలుగుతుందని మీకు తెలుసా? పాలు ఎక్కువ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలుఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

పాలు ఎక్కువగా తాగడం వల్ల వచ్చే సమస్యలు..

జీర్ణ సమస్యలు: పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, అతిసారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరం లాక్టోస్‌ను సరిగ్గా విచ్ఛిన్నం చేయలేకపోతే, అది జీర్ణవ్యవస్థ గుండా వెళుతుంది. గట్ బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమవుతుంది. ఇది గ్యాస్ ఏర్పడటానికి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

పేగు సంబంధిత సిండ్రోమ్: మీ శరీరం పాలకు అనుగుణంగా లేకుంటే, మీరు దీని కారణంగా పేగు సిండ్రోమ్‌కు గురవుతారు. దీని కారణంగా, మీరు అన్ని ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటారు. ఎక్కువగా తలనొప్పి సమస్య కూడా వేధించే అవకాశం ఉంది.

మొటిమల సమస్య: పాలు ఎక్కువగా తాగటం వల్ల మొటిమలతో బాధపడాల్సి ఉంటుంది.. ముఖంపై మొటిమలు, మచ్చలు తరచూ వేధిస్తున్నట్టయితే.. మీరు రోజుకు ఎన్ని పాలు తాగుతున్నారో గమనించండి. పాలలోని కొన్ని రసాయనాలు బ్రేక్అవుట్ సమస్యలను కలిగిస్తాయి.

బరువు పెరగడం: పాలలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. పాలను నివారించాలి.. లేదా చాలా తక్కువగా తీసుకోవాలి. లేదంటే పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు.

ఐరన్ లోపం: పాలు ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. పాలు ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తాయి. మీకు రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పాలపైనే ఆధారపడి పోషణ కోసం ఈ అలవాటును మార్చుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..