Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Slim Your Waist: నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలా.. అయితే ఇలా ట్రై చేయండి!

నడుము నాజూగ్గా సన్నగా ఉండాలని అనుకోని వ్యక్తి ఉండరు. మగ వాళ్లైనా, ఆడవారైనా నడుము సన్నగా ఉండాలి అనుకుంటారు. పెళ్లి కాని వాళ్లే కాదు.. పెళ్లి అయిన వాళ్లు కూడా కోరుకుంటుంది అదే. కానీ ఇప్పటి రోజుల్లో నడుము సన్నగా అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా చాలా కష్టంగా మారింది. కారణం రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఫ్యాటీ ఫుడ్స్, జంక్, ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. ఇలా తినేసి కూర్చోవడం కారణంగా.. నడుము భాగంలో, ఉదయం భాగంలో కొవ్వు బాగా..

Slim Your Waist: నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలా.. అయితే ఇలా ట్రై చేయండి!
Waist
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2023 | 5:00 PM

నడుము నాజూగ్గా సన్నగా ఉండాలని అనుకోని వ్యక్తి ఉండరు. మగ వాళ్లైనా, ఆడవారైనా నడుము సన్నగా ఉండాలి అనుకుంటారు. పెళ్లి కాని వాళ్లే కాదు.. పెళ్లి అయిన వాళ్లు కూడా కోరుకుంటుంది అదే. కానీ ఇప్పటి రోజుల్లో నడుము సన్నగా అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా చాలా కష్టంగా మారింది. కారణం రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఫ్యాటీ ఫుడ్స్, జంక్, ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. ఇలా తినేసి కూర్చోవడం కారణంగా.. నడుము భాగంలో, ఉదయం భాగంలో కొవ్వు బాగా పేరుకు పోతుంది. ఆ తర్వాత దీన్ని తగ్గించుకోవడంలో కాన్సన్ ట్రేట్ పెట్టడం లేదు. దీంతో షేప్స్ అవుట్ అవుతున్నాయి. కొంత మంది అయితే పక్కకు తిరగడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నాజూకైన నడుము కావాలంటే మాత్రం కింద చెప్పిన విధంగా క్రమం తప్పకుండా చేస్తే మాత్రం సన్నని నడుము మీ సొంతం అవుతుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. ఇలా ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

* నిటారుగా నిలబడి రెండు కాళ్లను దూరంగా జరపాలి. లెఫ్ట్ హ్యాండ్ ను నడుం మీద ఆనించి.. ఇప్పుడు రైట్ మోకాలిని పైకి లేపాలి. ఆ తర్వాత కుడి మోచేతిని ఆనించాలి. ఇప్పుడు ఇలాగే లెఫ్ట్ మోకాలితోనూ చేయాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.

* కింద కూర్చొని రెండు కాళ్లను పైకి లేపాలి. ఇప్పుడు చేతులను ఒక సారి లెఫ్ట్ వైపు, రెండో సారి రైట్ వైపు తిప్పాలి. ఇలా ఓ 30 సార్లు అయినా చేయాలి.

ఇవి కూడా చదవండి

* వెల్లకిలా పడుకుని కాళ్లను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి. ఆ తర్వాత మోచేతులను మడవాలి. నెక్ట్స్ మరో కాలిని స్ట్రైట్ గా ఉంచి మరో కాలిని మడవాలి. ఇప్పుడు మడత పెట్టిన కుడి కాలును కుడి మోచేత్తో తాకాలి.

* మందు నేల మీద కూర్చొవాలి. ఇప్పుడు రెండు లెగ్స్ ని కాస్త పైకి పెట్టాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి, చేతులకు ఆనించి మోచేతుల వరకూ మడుచు కోవాలి. ఇప్పుడు స్ట్రైట్ ఉన్న కాలిని మడుచుకోవాలి. మడిచిక కాలిని మోచేత్తో తాకాలి. ఇప్పుడు ఇలాగే ఎడమ కాలికి చేయాలి.

అంతే ఇలా బయటకు వెళ్ల లేని వాళ్లు ఇంట్లో ఉన్నప్పుడైనా ఇలా నుడుము వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు త్వరలోనే రిజల్ట్స్ కనిపిస్తాయి. వ్యాయామం చేస్తూనే తగిన డైట్ కూడా ఫాలో అవ్వాలి. లేదంటే ఫలితాలు సరిగ్గా రావు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.