AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఊరి పావురాలు కోటీశ్వరులు..! 27 దుకాణాలకు యజమాని, ఎకరాల కొద్దీ భూములు, భారీగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌తో..

షాపుల నుంచి నెలకు అద్దె రూపంలో మొత్తం 80 వేల వరకు ఆదాయం వస్తోంది. దాదాపు 126 బిఘాల వ్యవసాయ భూమి స్థిరాస్తి. సంపాదన నుండి పావురాల సంరక్షణకు ఖర్చు చేసిన తర్వాత పొదుపు గ్రామ బ్యాంకులోనే జమ చేస్తారు. ఇది నేడు సుమారు రూ.30 లక్షలకు పైనే సమకూరింది.

ఈ ఊరి పావురాలు కోటీశ్వరులు..! 27 దుకాణాలకు యజమాని,  ఎకరాల కొద్దీ భూములు, భారీగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌తో..
Birds Land Owners
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2023 | 6:45 PM

Share

మన దేశంలో చాలా మంది కోటీశ్వరులున్నారు. చాల మందికి కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. కోటీశ్వరులు కావడానికి ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అయితే, పక్షుల పేరుతో కోట్ల సంపద గురించి మీరెప్పుడైనా విన్నారా..? కానీ, మిలియనీర్ పావురాలు నివసించే గ్రామం ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే.. ఈ గ్రామంలోని పావురాలకు దుకాణాలు, అనేక బిగాల భూములు, నగదు సహా కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. ఈ ప్రత్యేక గ్రామం రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పేరు జస్‌నగర్. పావురాలకు 27 దుకాణాలు, 126 బిగాల భూమి, సుమారు 30 లక్షల రూపాయల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ పావురాల 10 బిఘా భూమిలో 470 గోశాలలు కూడా నడుస్తున్నాయి. కోటీశ్వరులైన పావురాలు నివసించే ఈ గ్రామం కథేంటో ఇక్కడ తెలుసుకుందాం..

40 సంవత్సరాల క్రితం, గ్రామ మాజీ సర్పంచ్ రామ్‌దిన్ చోటియా ఆదేశాల మేరకు గ్రామస్తుల మద్దతుతో ప్రవాస వ్యాపారులు దివంగత సజ్జన్‌రాజ్ జైన్, ప్రభుసింహ రాజ్‌పురోహిత్ ట్రస్ట్‌ను స్థాపించారు. వారి గురువైన మరుధర్ కేస్రీని స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని గ్రామస్తుల సహాయంతో. భామాషాలు పావురాల సంరక్షణ, సాధారణ దాణా ఏర్పాట్ల కోసం ఒక ట్రస్ట్ ద్వారా పట్టణంలో 27 దుకాణాలను నిర్మించి పేర్లు పెట్టారు. ఇప్పుడు ఈ సంపాదనతో ట్రస్టు గత 30 ఏళ్లుగా ప్రతిరోజు 3 బస్తాల ధాన్యం ఇస్తోంది.

పావురాల ట్రస్ట్ ద్వారా రోజుకు సుమారు నాలుగు వేల రూపాయలతో 3 బస్తాల వడ్లు ఏర్పాటు చేస్తారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 470 ఆవులకు మేత, నీరు అందిస్తున్నారు. షాపుల నుంచి నెలకు అద్దె రూపంలో మొత్తం 80 వేల వరకు ఆదాయం వస్తోంది. దాదాపు 126 బిఘాల వ్యవసాయ భూమి స్థిరాస్తి. సంపాదన నుండి పావురాల సంరక్షణకు ఖర్చు చేసిన తర్వాత పొదుపు గ్రామ బ్యాంకులోనే జమ చేస్తారు. ఇది నేడు సుమారు రూ.30 లక్షలకు పైనే సమకూరింది.

ఇవి కూడా చదవండి

పావురం ట్రస్ట్ కార్యదర్శి ప్రభు సింగ్ రాజ్‌పురోహిత్ ప్రకారం, ప్రజలు జాస్‌నగర్‌లోని పావురాల కోసం కూడా విరాళం ఇస్తారు. ప్రతినెలా చాలా మంది నుంచి విరాళాలు అందుతుంటాయిని చెప్పారు. పావురాల కోసం తెరిచిన 27 దుకాణాలు వార్షిక ఆదాయం రూ. 9 లక్షలు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..