బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా..? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..!

ఇందులో ఉండే సంతృప్త కొవ్వులు నేరుగా ధమనుల్లో పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌, బట్టర్‌ కలిపి తినే వారు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో శరీర బరువు పెరగడమే కాక కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా..? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..!
Eating Cheese And Bread
Follow us

|

Updated on: Sep 22, 2023 | 5:46 PM

బట్టర్‌, జున్ను, పన్నీర్‌ అంటే చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారు. దీనిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం చాలా మంది ప్రజలు పన్నీర్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పన్నీర్ తినే ట్రెండ్ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. పిల్లలు, యువకులు కూడా శాండ్‌విచ్‌లలో చీజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే జున్ను, బట్టర్‌ వంటి పాల పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిదేనా..? బట్టర్‌ ఎక్కువగా తినడం వల్ల, ముఖ్యంగా చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో బట్టర్‌ తింటుంటారు. అయితే, ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేడ్‌ బట్టర్‌ తినడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. బట్టర్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కేవలం ఒక చీజ్ ముక్కలో 200 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది.

2. క్యూబ్స్, చీజ్ ముక్కలు వివిధ ఆకృతుల్లో మార్కెట్లో అమ్ముతుంటారు. అందుకోసం దానికి అనేక రసాయనాలు, కృత్రిమ రంగులు కలపాల్సి ఉంటుంది.. ఇవన్నీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఇది జీర్ణ సమస్యలు, అలెర్జీలకు కూడా కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

3. చీజ్ ముక్కలలో ప్రాసెస్ చేసిన కొవ్వు ఉంటుంది. దీని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అలాగే, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

4. సహజ బట్టర్‌తో పోలిస్తే ముక్కలుగా తయారు చేసిన చీజ్‌లో చాలా పోషకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా భావించి తిన్నా నష్టాన్ని భరించాల్సిందే.

5. మార్కెట్‌లో కొనుగోలు చేసే బట్టర్‌ని ఎల్లప్పుడూ ప్లాస్టిక్‌లో ప్యాక్ చేస్తారు. దాని ప్యాకేజింగ్‌లోని రసాయనాలు జున్నులోకి ప్రవేశించి ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తాయి.

6. బట్టర్‌లో ఉండే సంతృప్త కొవ్వులు నేరుగా ధమనుల్లో పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌, బట్టర్‌ కలిపి తినే వారు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో శరీర బరువు పెరగడమే కాక కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

7. బట్టర్‌తో పాటు బ్రెడ్‌ ఎక్కువగా తినేవాళ్లకు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి పెరిగేలా చేస్తుంది. ఇంకా చర్మంపై మొటిమలను కలిగిస్తుంది. బ్రెడ్‌లోని గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక కొవ్వు కారణంగా త్వారగా గ్యాస్ట్రిక్ సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. దీంతో స్థూలకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..