Viral: మా మంచి మాస్టారు.. ఉత్తమ ఉపాద్యాయుడుగా సత్యనారాయణ.. ఎందుకంటే.?
అందరి లానే అతను ఒక సామాన్య ఉపాధ్యాయుడు కానీ అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. సమాజంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇతనిని స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో కొంతలో కొంత మార్పులు తీసుకురావచ్చు అంటున్నారు స్థానిక ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి గ్రామానికి చెందిన ఉప్పే సత్యనారాయణ అమలాపురం మండలం సాకుర్రు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత విద్య పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.
అందరి లానే అతను ఒక సామాన్య ఉపాధ్యాయుడు కానీ అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. సమాజంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇతనిని స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో కొంతలో కొంత మార్పులు తీసుకురావచ్చు అంటున్నారు స్థానిక ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి గ్రామానికి చెందిన ఉప్పే సత్యనారాయణ అమలాపురం మండలం సాకుర్రు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత విద్య పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠాలు నేర్పడంలో నిస్ణాతుడు. సత్యనారాయణకు వచ్చే జీతంలో పది శాతం జీతాన్ని ప్రతీ నెలా స్కూలు అభివృద్ధికి పిల్లలు పెన్నులు పుస్తకాలు కొనుక్కోలేని పేద విద్యార్థులకు అండగా ఉంటారు. విద్యకు ప్రోత్యహం ఇవ్వటమే కాకుండా తనకు స్కూల్ టైం ముగిసిన తర్వాత… తన సొంత గ్రామంలోనే కాకుండా ఉద్యోగం చేసే పరిసర ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. ఆర్టీసీ బస్సులు సౌకర్యం లేని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు వేయించి రవాణా సౌకర్యాలు కల్పించడం, రోడ్లు వేయించడం, కల్వర్ట్లు నిర్మించడం గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఇతను చేసే సేవా కార్యక్రమాలు పలువురి మనసుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇతను చేసిన సేవలకు మెరిటేరియస్ టీచర్ నేషనల్ అవార్డ్ వరించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతులు మీదుగా అవార్డు అందుకోవటం మరొక విశేషం. మా స్కూల్ కి మా గ్రామానికి సత్యనారాయణ ఉపాధ్యాయుని వల్ల గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు ఈయనకు సన్మానం ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..