Hyderabad: కోవిడ్ పేరుతో లక్షలు దండుకున్నారు.. ఆస్పత్రులపై కొరఢా ఝుళిపిస్తున్న కోర్ట్… బాధితులకు రీఫండ్
Hyderabad: 3.8 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా టిఎక్స్ హాస్పిటల్స్ కు కన్జ్యూమర్ వివాదాల పరిష్కారాల ఫోరం ఆదేశించింది. ఇక మరో కేసులో ఆర్టిపిసిఅర్ టెస్ట్ కోసం వెళ్లిన బాధితుడికి 700 రూపాయలకు బదులు అదనపు చార్జీ విధించడంతో ఫోరమ్ ను ఆశ్రయించాడు బాధితుడు.. దీంతో ఆ బాధితుడికి వెయ్యి రూపాయలు రిఫండ్ చేయాలని ఫోరం ఆదేశించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: గతంలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ఉగ్రరూపంతో ప్రజల్ని పట్టిపీడించింది. వైరస్ ధాటికి ప్రజలు పిట్టల్లా ప్రాణాలు విడిచారు. వైద్యం కోసం ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు.. బాధిత కుటుంబాలను నిలువు దోపిడీ చేశాయి. కోవిడ్ -19 పరీక్షలు, చికిత్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేశాయంటూ పలువురు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. పోరాలం తర్వాత వారు తము చెల్లించిన సొమ్మును తిరిగి పొందుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం.. వినియోగదారునికి రూ. 3.8 లక్షలు వాపసు చేయాలని కన్జ్యూమర్ వివాదాల పరిష్కారాల ఫోరం ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా సమయంలో అధిక చార్జీలు వసూలు చేసిన Tx హాస్పిటల్స్ పై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు ఫిర్యాదు చేశాడు ఆదిత్య అనే యువకుడు. 2021లో తన తండ్రికి కోవిడ్ సోకటంతో tx హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ చేశాడు ఆదిత్య. కోవిడ్ 19 పేరుతో సెకండ్ వేవులో చాలా హాస్పిటల్స్ అధిక చార్జీలు వసూలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి హాస్పిటల్ లపై ప్రభుత్వం లైసెన్స్ రద్దు కూడా చేసింది. వాటిలో ఒకటి tx హాస్పిటల్స్. 2021 మే నెల 8వ తారీఖున హాస్పిటల్లో తమ తండ్రిని అడ్మిట్ చేశాడు ఆదిత్య. అయితే చికిత్స పొందుతూ మే 17న ఆదిత్య తండ్రి మరణించాడు. Tx హాస్పిటల్స్ ఫైనల్ బిల్ సెటిల్ చేయడానికి 10.6 లక్షలు రూపాయలు బిల్ వేశారు.. అయితే ఇన్సూరెన్స్ ఉండటంతో అంత బిల్ పే చేయడానికి ఆదిత్య వెనకాడ లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే క్రమంలో కొన్ని చార్జీలు రియంబర్స్ కాకపోవటంతో అనుమానం వచ్చిన ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యాన్ని వివరణ కోరాడు. అయితే కోవిడ్ కారణంగా హాస్పిటల్ అధిక చార్జీలు వసూలు చేసినట్టు ఆదిత్య గుర్తించాడు. అదనపు చార్జీలుగా 4.2 లక్షల రూపాయలను హాస్పిటల్ వివిధ కారణాలు చూపి చార్జ్ చేసింది. కన్జ్యూమర్ పరిష్కారాల ఫోరం ను ఆశ్రయించాడు ఆదిత్య. తాను చెల్లించిన 90% బిల్లు రిఫండ్ చేయాల్సిందిగా కోరాడు. హాస్పిటల్ కి నోటీసులు జారీ చేసినప్పటికీ tx హాస్పిటల్స్ రిప్లై ఇవ్వలేదు.
3.8 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా టిఎక్స్ హాస్పిటల్స్ కు కన్జ్యూమర్ వివాదాల పరిష్కారాల ఫోరం ఆదేశించింది. ఇక మరో కేసులో ఆర్టిపిసిఅర్ టెస్ట్ కోసం వెళ్లిన బాధితుడికి 700 రూపాయలకు బదులు అదనపు చార్జీ విధించడంతో ఫోరమ్ ను ఆశ్రయించాడు బాధితుడు.. దీంతో ఆ బాధితుడికి వెయ్యి రూపాయలు రిఫండ్ చేయాలని ఫోరం ఆదేశించింది. జగతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఆర్టిపిసిఆర్ టెస్ట్ కోసం వెళ్ళాడు శ్రీకాంత్. 2022 లో టెస్ట్ కోసం 1200 రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన 500 రూపాయలకు బదులు అదనంగా మరో 700 రూపాయలు ఛార్జ్ చేశారు.
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి ఏ రేంజ్ లో విలయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్ని లక్షలు ఖర్చుపెట్టడానికైనా సగటు జీవి వెనుకాడ లేదు. కొంతమంది అయితే ఎన్నో లక్షలు పెట్టి ప్రాణాలు కోల్పోయారు.. ఇలా కోవిడ్ మహమ్మారి వినయానికి యావత్ ప్రపంచం కకావికలమైంది. కోవిడ్ మహమ్మారి వల్ల కొన్ని హాస్పిటళ్ళ రేంజ్ ఏ మారిపోయింది… మోతాదుకు మించి కోవిడ్ పేరుతో బిల్స్ వేశారు కొన్ని హాస్పిటళ్లు.. తమకు అందిన కాడికి దోచుకోవడానికి కోవిడ్ మహమ్మారిని ఒక ఆయుధంగా వాడుకున్న హాస్పిటళ్లు లెక్కలేనని ఉన్నాయి.. ఒక్కొక్క పేషెంట్ ఆవరేజ్ గా 10 లక్షలు చెల్లించిన హాస్పిటల్లో ఒక హైదరాబాదులోనే 20 శాతానికి పైగా ఉంటాయి. అయితే కోవిడ్ అధికంగా ఉన్న సమయంలోనే కొన్ని హాస్పిటల్లో పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్లో పైన అప్పట్లోనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆయా హాస్పిటల్ లో కోవిడ్ చార్జీలు అధికంగా తీసుకుంటున్నడంతో వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రభుత్వం. ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేసి కోర్టుకు వెళ్లి మరి స్టే తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..