అరికాళ్ళ దురదగా ఉంటుందా..? పాదాలు వెచ్చగా ఉన్నాయా..? ఐతే, నిర్లక్ష్యం చేయకండి..!
కాలేయం ఆరోగ్యం కోసం గ్రీన్ టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేయం ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో ఉపయోగిస్తే మంచిది. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే, కాలేయం ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి ఆహారం కాలేయ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.
శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. గుండె, మెదడు శరీరానికి ముఖ్యమైనవి. కాలేయం కూడా మానవ శరీరానికి అంతే ముఖ్యమైనది. కాలేయం ప్రభావితమైతే, శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అందుకే ప్రతిఒక్కరూ కాలేయ ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాలేయం దెబ్బతింటే బాగుచేసుకోలేం.. కానీ, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కాలేయం దెబ్బ తినడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యల బారినపడుతున్నారు. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా ఎక్కువ మంది ఇలాంటి సమస్యల బారినపడుతున్నారు. శరీరంలో కాలేయం దెబ్బతింటే.. మనలో అనేక సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ సాంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరికాళ్ళు దురద : అరికాళ్ళు తరచుగా దురదగా ఉంటాయి. ఈ దురద అంత తేలికగా తగ్గదు. ముఖ్యంగా పాదాల అడుగుభాగంలో విపరీతమైన దురదలు రావడం కాలేయం దెబ్బతినడానికి సంకేతం.
అరికాళ్ళలో వాపు, నొప్పి : కొంతమంది తరచుగా వారి పాదాల దిగువ భాగంలో లేదా అరికాళ్ళలో వాపు, నొప్పిని అనుభవిస్తారు. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. కాలేయంలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి.. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే కాలేయం చెడిపోవడం ప్రారంభమవుతుంది.
పాదాల దుర్వాసన : తరచుగా పాదాల దుర్వాసన, ముఖ్యంగా అరికాళ్ళ నుండి దుర్వాసన వచ్చినట్టయితే.. నిర్లక్ష్యం చేయకూడదు. పాదాల దుర్వాసన కాలేయ వ్యాధికి ఒక లక్షణం కావచ్చు.
వెచ్చని పాదాలు : కొన్ని సందర్భాల్లో, పాదం దిగువ భాగం అంటే అరికాలు వెచ్చగా అనిపించవచ్చు. ఇది కాలేయ సమస్యకు సంకేతం. కాలేయం రక్తాన్ని సరిగ్గా శుభ్రం చేయనప్పుడు, అరికాళ్ళు వెచ్చగా ఉంటాయి.
పాదాలలో ఎడెమా : ఇది పాదాలలో వాపు, గుంటలు ఏర్పడే వ్యాధి. కాలేయం సరిగా పనిచేయడం లేదనే సంకేతం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
కాలి గోరు శిలీంధ్రం: టోనెయిల్ ఫంగస్ కాలేయం దెబ్బతినడానికి సంకేతం.
కాలి గోళ్లలో తెల్లదనం : గోళ్లు తెల్లగా మారడం ప్రారంభించినట్లయితే, అది కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఇతర కారణాల వల్ల సంభవించినప్పటికీ, అటువంటి సందర్భాలలో వైద్యుడిని సంప్రదించడం అవసరం.
కాలేయం ఆరోగ్యం కోసం కోడి మాసం, సీఫుడ్, బీన్స్ వంటి లీన్ ప్రోటీన్స్ ఆహారం తీసుకోవటం అవసరం ఉంది. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. కాలేయం ఆరోగ్యం కోసం గ్రీన్ టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేయం ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో ఉపయోగిస్తే మంచిది. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే, కాలేయం ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి ఆహారం కాలేయ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..