AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond Ganesh Idol: రూ.600 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?

ఈ గణపతి విగ్రహం 182.3 క్యారెట్ డైమండ్. 36.5 గ్రాముల బరువు ఉంటుంది. దీని మార్కెట్ ధర రూ.600 కోట్లుగా చెబుతున్నారు. ఇది సహజంగా ఏర్పడింది. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా నిరూపించబడింది. ప్రతి ఏటా ఈ వినాయకుడికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. 

Diamond Ganesh Idol: రూ.600 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?
Diamond Ganesha Idol
Jyothi Gadda
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 23, 2023 | 9:51 AM

Share

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్ర వినాయకుడిని ఏర్పాటు చేశాడు గుజరాత్ లో ఓ భక్తుడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి.. వినాయక చవితి సందర్భంగా ఆయన తన నివాసంలో అత్యంత ఖరీదైన, అరుదైన గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కనుభాయ్ రామ్‌జీభాయ్ అసోదరియా అనే వ్యక్తి 600 కోట్ల రూపాయల విలువైన వజ్ర గణపతిని ప్రతిష్టించారు. వజ్రాల వ్యాపారి అయిన అతడు వ్యాపారం నిమిత్తం 15 ఏళ్ల క్రితం బెల్జియం వెళ్లాడు. వారు అక్కడి నుండి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకువచ్చారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్టుగా తన తండ్రికి కల వచ్చిందట. వెంటనే వెళ్లి పరిశీలించగా, అందులో ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో కనిపించింది. దాంతో ఇక అప్పటి నుంచి వాళ్లు ఈ వజ్ర గణపతికి పూజలు చేస్తున్నారు.

ఈ గణపతి విగ్రహం 182.3 క్యారెట్ డైమండ్. 36.5 గ్రాముల బరువు ఉంటుంది. దీని మార్కెట్ ధర రూ.600 కోట్లుగా చెబుతున్నారు. సూరత్‌లోని అత్యంత ఖరీదైన గణేశ విగ్రహం ఇదే. ఇది లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా కూడా ధృవీకరించబడింది. 600 కోట్ల వజ్ర గణపతిని ప్రతిష్టించిన వ్యాపారవేత్త కునాభాయ్ మాట్లాడుతూ.. తమకు కరమ్ ఎక్స్‌పోర్ట్ డైమండ్ అనే కంపెనీ ఉందన్నారు. ఇంట్లో ప్రతిష్టించిన ఈ వినాయకుడు వజ్రాల గనిలో కనిపించాడని చెప్పాడు. ఇది సహజంగా ఏర్పడింది. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా నిరూపించబడింది. ప్రత్యేకమైన గణేశుని కారణంగా దీనిని ప్రపంచంలోని ఏకైక వజ్రం అని పిలుస్తారు. కరాన్ని డైమండ్ గణేశుడు అని కూడా అంటారు. కోహినూర్ వజ్రం కంటే ఇది పెద్దదని వ్యాపారవేత్త అనుభాయ్ రామ్‌జీభాయ్ అన్నారు. అయితే, వినాయకుడి ఆకారంలో ఉన్న ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. అందులో కనిపించే గణేశుని ట్రంక్ కుడివైపున తిరిగి ఉంటుంది. ఇలాంటిది చాలా వినాయక విగ్రహాల్లో కనిపించడం లేదు. గణేశుడి విగ్రహాలలో ఎక్కువగా ట్రంక్ ఎడమ వైపు మాత్రమే కనిపిస్తుంది. ప్రతి ఏటా ఈ వినాయకుడికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా నది జలాలను విగ్రహం మీద చల్లుతారు.

ఇదిలా ఉంటే, బెంగళూరులోని జెపి నగర్, పుట్టెనహళ్లిలోని సత్యగణపతి ఆలయంలో కరెన్సీ గణపతి కొలువుదీరాడు.. వినాయక చవితి సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా నోట్లు, నాణేలతో అలంకరించారు . సత్య గణపతి షిర్డీ సాయి ట్రస్ట్‌ను 5, 10, 20 రూపాయల నాణేలు, సుమారు 56 లక్షల విలువైన 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్లతో ఆకర్షణీయంగా అలంకరించారు. దాదాపు రూ.2.5 కోట్ల విలువైన నోట్లు, రూ.56 లక్షల విలువైన నాణేలను అలంకరించారు. గత నెల రోజులుగా 150 మంది అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆలయం మొత్తం భద్రతతో పాటు సీసీటీవీలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..