AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్య బాబోయ్‌.. ఒకేచోట నాలుగు కొండచిలువలు.. వాటి పిల్లలతో సహా ఏం చేశారో తెలుసా..? వీడియో

Visakhapatnam: ఇక్కడ నిజంగానే నాలుగు భారీ కొండచిలువలు, వాటి పిల్లలు కూడా కనిపించాయి. ఈ కొండ చిలువలు ప్రత్యక్షమైంది మరెక్కడో కాదు.. విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవి.. ఒక ఇంట్లో కోడి పిల్లలు ఉన్న గంప కింద దూరి వాటిని తింటూ పట్టుబడ్డ కొండ చిలువ ఒకటైతే, చేపల వలలో ఒకటి, ఇంకోటి కొండ దిగువ న ఉన్న ఇళ్లలోకి దూరిన పాము. ఇలా

Andhra Pradesh: అయ్య బాబోయ్‌.. ఒకేచోట నాలుగు కొండచిలువలు.. వాటి పిల్లలతో సహా  ఏం చేశారో తెలుసా..? వీడియో
Snake
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 23, 2023 | 10:44 AM

Share

విశాఖపట్నం, సెప్టెంబర్23: పాములంటే దాదాపు అందరూ భయంతో పరుగులు పెడతారు.. సడెన్‌గా పాము కనిపిస్తే అంతే సంగతులు.. ఫీజులు ఎగిరిపోతాయ్..అలాంటిది ఒకేసారి.. ఒకేచోట కొండచిలువల ఫ్యామిలీ కనిపిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి…అసలు నోటి వెంట మాట కూడా రాదు..పై ప్రాణాలు పైనే పోతాయి చాలా మందికి. ఇప్పడు ఈ పాముల గొలేంటి అనుకుంటున్నారా..? కానీ, ఇక్కడ నిజంగానే నాలుగు భారీ కొండచిలువలు, వాటి పిల్లలు కూడా కనిపించాయి. ఈ కొండ చిలువలు ప్రత్యక్షమైంది మరెక్కడో కాదు.. విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవే. ఒక ఇంట్లో కోడి పిల్లలు ఉన్న గంప కింద దూరి వాటిని తింటూ పట్టుబడ్డ కొండ చిలువ ఒకటైతే, చేపల వలలో ఒకటి, ఇంకోటి కొండ దిగువ న ఉన్న ఇళ్లలోకి దూరిన పాము. ఇలా విశాఖ లో ఎక్కడ పాము కనిపించినా ముందుగా గుర్తొచ్చే పేరు కిరణ్. ప్రస్తుతం అతని ఇంటిపేరు స్నేక్ క్యాచర్ కిరణ్.

విశాఖకు చెందిన కిరణ్ పాములు పట్టడంలో నైపుణ్యుడు. విశాఖ నగరంలో కనిపించే చిన్న, పెద్ద ఏ సర్పాలనైనా అట్టే చాకచక్యంగా పట్టేస్తుంటాడని కిరణ్ కు పేరుంది. ఆ తర్వాత వాటిని అడవుల్లో వదిలేస్తుంటారు. అలానే ఇటీవల నగరంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న ఈ నాలుగు భారీ కొండచిలువలను శుక్రవారం స్టీల్ ప్లాంట్ కు, పరవాడ కు మధ్యనున్న ప్రాంతంలో వదిలేశారు. వాటిని వదిలే సందర్భంగా చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

విశాఖ లో కింగ్ కోబ్రా, కొండచిలువ సంచారం ఎక్కువ

విశాఖపట్నం తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యలో ఉంటుంది. తూర్పు కనుమల పర్వత శ్రేణి విస్తృతంగా విశాఖ నగరం మధ్యలోనే ఉండడం వల్ల ఎత్తైన కొండలు వాటిలో దట్టమైన అడవులు ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, సముద్రం మధ్య విశాఖ నగరం ఉంటుంది. దీంతో అడవుల్లో ఉండే సర్ప జాలం ఎక్కువగా జనజీవన స్రవంతిలోకి నిరంతరం వస్తూ ఉంటాయి. వీటికి తోడు కొండ దిగువ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలు విశాఖలో అనేక ఉంటాయి. వాటితో పాటు లగ్జరీ విల్లాస్ లాంటివి కూడా కొండవాలు ప్రాంతాల్లో ఉంటుంటాయి. సో ఇట్లాంటి ప్రాంతాల్లోకి వచ్చే పాములను పట్టడానికి స్నేక్ క్యాచర్ కిరణ్ తో పాటు ఇటీవల కాలంలో దానిపై ఆసక్తి పెంచుకున్న పలువురు అందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం విశేషం. అదే సమయంలో విశాఖలో కొండ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వాటిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో నుంచి జెర్రీ పోతులు, కింగ్ కోబ్రా, కొండ చిలువ లు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. వీటివల్ల కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పెను ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..