Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Retrofitting: పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చా? కీలక సమాచారం మీకోసం..

EV Retrofitting: వాహనాల అధిక ధర దృష్ట్యా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0లో 'రెట్రోఫిట్టింగ్'ను ప్రోత్సహిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రజలు తమ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఖరీదైనది. సాధారణ జిప్సీలో ఈ రకమైన సవరణకు దాదాపు రూ. 5 నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుంది.

EV Retrofitting: పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చా? కీలక సమాచారం మీకోసం..
Electri Car
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 7:06 PM

EV Retrofitting: వాహనాల అధిక ధర దృష్ట్యా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0లో ‘రెట్రోఫిట్టింగ్’ను ప్రోత్సహిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రజలు తమ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఖరీదైనది. సాధారణ జిప్సీలో ఈ రకమైన సవరణకు దాదాపు రూ. 5 నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది చాలా ఎక్కువ. కానీ, ప్రజల ఆలోచనల దృష్ణా.. ఇందుకోసం పాలసీని తీసుకురావాలని ఆలోచిస్తున్నాం‘ అంటూ మంత్రి తెలిపారు.

కొత్త పాలసీకి సంబంధించిన పనులు కొనసాగుతన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత పాలసీని 6 నెలలు లేదా కొత్త పాలసీ సిద్ధమయ్యే వరకు పొడిగిస్తామని గెహ్లాట్ చెప్పారు. ‘క్యాబినెట్ నోట్‌ను తీసుకువస్తున్నాం. ఈ వారంలో అది ఖరారు కావాల్సి ఉంటుంది.’ అని చెప్పారు మంత్రి. ప్రస్తుత అమల్లో ఉన్న పాలసీని ఆరు నెలల పాటు పొడిగించడం జరుగుతుందన్నారు. లేదంటే కొత్త పాలసీ నోటిఫికేషన్ వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2020 గడువు ఆగస్టు 8న పూర్తయింది. కొత్త పాలసీని ప్రకటించే వరకు పాత పాలసీ కింద ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వం కొనసాగించనుంది.

EV రెట్రోఫిటింగ్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రక్రియను రెట్రోఫిటింగ్ అంటారు. ఈ ప్రక్రియలో, పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌ను తొలగించి, దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని అమరుస్తారు. అంతే కాకుండా, పవర్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, ఛార్జింగ్ సిస్టమ్ మొదలైన ఇతర అవసరమైన మార్పులు కూడా చేస్తారు. అలాగే, కారు వెలుపలి భాగంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

పెట్రోల్/డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి అయ్యే ఖర్చు.. కారు పరిస్థితి, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ధర, ఇన్‌స్టాలేషన్ ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీని మొత్తం ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. ప్రస్తుతం అనేక కంపెనీ ఈ ఈవీ రెట్రోఫిట్టింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..