విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్ కోసం.. ఆసక్తి చూపుతున్న భారతీయులు
విదేశాల్లో ఉన్నత చదువు కోసం ఆంగ్ల అర్హతా పరీక్ష టోఫెల్ రాసేవారి సంఖ్య ఇండియాలో గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే టోఫెల్‌కు హాజరయ్యే వారిలోలో చూసుకుంటే.. విదేశాల్లో మాధ్యమిక విద్య, సర్టిఫికేషన్ చేసేవారి సంఖ్య కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా పెరుగుతోందని తాజా నివేదికలో ఈటీఎస్ వెల్లడించింది. అయితే ఇదే సమయంలో ఇమ్మిగ్రేషన్ కోసం వెళ్లడానికి టోఫెల్‌కు హాజరవుతున్న వారిలో ఈ సంఖ్య తగ్గిపోతున్నట్లు పేర్కొంది.
విదేశాల్లో ఉన్నత చదువు కోసం ఆంగ్ల అర్హతా పరీక్ష టోఫెల్ రాసేవారి సంఖ్య ఇండియాలో గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే టోఫెల్‌కు హాజరయ్యే వారిలోలో చూసుకుంటే.. విదేశాల్లో మాధ్యమిక విద్య, సర్టిఫికేషన్ చేసేవారి సంఖ్య కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా పెరుగుతోందని తాజా నివేదికలో ఈటీఎస్ వెల్లడించింది. అయితే ఇదే సమయంలో ఇమ్మిగ్రేషన్ కోసం వెళ్లడానికి టోఫెల్‌కు హాజరవుతున్న వారిలో ఈ సంఖ్య తగ్గిపోతున్నట్లు పేర్కొంది. అలాగే లైసెన్సు, సర్టిఫికేట్ లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకు టోఫెల్ తీసుకుంటున్న మొత్తం ఆశావహుల్లో భారతీయుల సంఖ్య 2021లో 5.83 శాతంగా ఉంది. అయితే 2022 నాటికి అది 7.77కి ఎకబాకింది. అయితే ఈ వ్యవధిలోనే ఉద్యోగం లేదా ఇమ్మిగ్రేషన్ కోసం టోఫెల్ పరీక్ష రాస్తున్న వారిసంఖ్య 8.19 శాతం నుంచి 7.22 శాతానికి పడిపోయినట్లు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ETS) తెలిపింది.
మరోవైపు డిగ్రీ లేదా పీజీ కోసం టోఫెల్‌కు హాజరవుతోన్నటువంటి భారతీయుల సంఖ్య 2021లో 70.84 శాతం ఉండగా.. 2022లో 71.87 శాతానికి పెరిగిపోయిందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మరోవైపు కొవిడ్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఇండియాలో ఏకంగా 59 శాతం పెరిగిపోయినట్లు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ గతవారం వెల్లడించింది. మరోవైపు సెకండరీ ఎడ్యుకేషన్ కోసం సైతం టోఫెల్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు యువ జనాభాలో మారుతున్న ఆకాంక్షలకు ఇది నిదర్శనంగా ఉందంటూ.. ఈటీఎస్ ఇండియా మేనేజర్ సచిన్ జైన్ వెల్లడించారు.
అయితే 2018వ సంవత్సరం నుంచి ఇలాంటి ధోరణి గమనిస్తున్నామని తెలిపారు. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 25 లక్షల వరకు చేరవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా భారతీయ విద్యార్థుల ప్రతిభపై ఆసక్తిని చూపిస్తున్నాయని వెల్లడించారు. ఆంగ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకొనే టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (TOEFL), గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్‌ఈ)లను అమెరికాకు చెందిన (ప్రిన్స్‌టన్) ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లోని ఉన్న 12 వేల యూనివర్శిటీలు ఈ టోఫెల్ పరీక్షలో సాధించిన మార్కులను తమ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో సైతం కొన్ని ప్రసిద్ధ యూనివర్శిటీలు టోఫెల్‌లో సాధించిన స్కోర్ ఆధారంగానే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.