9 New Vande Bharat Trains: పట్టాలెక్కిన 9 వందే భారత్‌ రైళ్లు.. వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి ప్రారంభించిన మోదీ

దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం (సెప్టెంబర్‌ 24) పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ నుంచి..

9 New Vande Bharat Trains: పట్టాలెక్కిన 9 వందే భారత్‌ రైళ్లు.. వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి ప్రారంభించిన మోదీ
ఇవే కాకుండా.. ఇప్పుడు కొత్తగా మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి నడవనుంది. ఇంతకీ ఆ ట్రైన్ వెళ్లే రూట్ ఏంటని ఆలోచిస్తున్నారా.? కొంచెం ఆగండి.. మేమే చెప్పేస్తాం.
Follow us

|

Updated on: Sep 24, 2023 | 1:08 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24: దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం (సెప్టెంబర్‌ 24) పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించింది. వందేభారత్‌ ఆపని చేస్తుంది. గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరన రూపొందిస్తున్నాం. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచింది. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది. వేగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌ రైళ్లు పనిచేస్తున్నాయి. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’ అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్.. 11 రాష్ట్రాలతో కనెక్టివిటీ కలిగి ఉంటాయి. ఆయా మార్గాల్లో అత్యంత వేగవంతంగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేయడంలో ఈ కొత్త వందే భారత్‌ రైళ్లు సహాయపడతాయి. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైళ్లతో పోలిస్తే..

ఇవి కూడా చదవండి

రూర్కెలా- భువనేశ్వర్ – పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసరగోడ్ – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు 3 గంటల వేగంతో వేగంగా ప్రయాణిస్తాయి. హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2.5 గంటలకు పైగా వేగంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తాయి. ఇక తిరునెల్వేలి-మధురై- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2 గంటలకు పైగా వేగంగా పరుగెత్తుతుంది. రాంచీ – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా – హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంట వేగంగా ప్రయాణించి సమయాన్ని ఆదా చేస్తాయి. అలాగే ఉదయపూర్ – జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అరగంట సమయాన్ని ఆదా చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!