ప్రభుత్వ అప్పులను తీర్చేందుకు నా సాయం..తమిళనాడులో రూ. 2.63 లక్షల చెక్కుతో అధికారుల వద్దకు ‘అపరగాంధీ’ !

తమిళనాడులో ఇదో విచిత్ర సంఘటన.. గత అన్నా డీఎంకే ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్రం అప్పులపాలైందంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.తియగ రాజన్ అసెంబ్లీలో ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని,

ప్రభుత్వ అప్పులను తీర్చేందుకు నా సాయం..తమిళనాడులో రూ. 2.63 లక్షల చెక్కుతో అధికారుల వద్దకు 'అపరగాంధీ' !
Man In Gandhi In Tamilnadu
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2021 | 10:38 AM

తమిళనాడులో ఇదో విచిత్ర సంఘటన.. గత అన్నా డీఎంకే ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్రం అప్పులపాలైందంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.తియగ రాజన్ అసెంబ్లీలో ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన ఇందులో ఆరోపించారు. 2022 మార్చి నాటికి ఈ సర్కార్ 5,70,189 లక్షల కోట్ల రుణభారాన్ని నెత్తికెత్తుకోవలసి ఉంటుందన్నారు. 2011 నుంచి ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఈ పరిస్థితి కారణంగా రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపైన రూ.2,63,976 మేర రుణభారం పడుతుందని ఆయన ఈ శ్వేత పత్రంలో పేర్కొన్నారు. అయితే మహాత్మా గాంధీ అభిమాని అయిన రమేష్ గాంధీ అనే వ్యక్తి..అచ్చు గాంధీజీలా వేషం ధరించి.. ఇంత మొత్తానికి ఓ పెద్ద చెక్కు పట్టుకుని నమక్కల్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ చెక్కును బ్యాంకులో సమర్పిస్తానని, మొదట మీరు ఇందుకు ఆమోదం తెలపాలని అన్నాడు.

అయితే అధికారులు ఆశ్చర్యపోయి.. ఆ చెక్కును తీసుకోవడానికి నిరాకరించారు.. మొదట నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా అని కోరారు. కాగా తనలాగే రాష్ట్రంలోని ఏ వ్యక్తి అయినా ఇలా ప్రభుత్వ అప్పులను తీర్చడంలో ఖజానాకు సాయ పడేందుకు ముందుకు రావాలని ఈ ‘అపర గాంధీ’ కోరుతున్నాడు. ఇతని అతి తెలివికి నవ్వాలో, ఏడవాలో అధికారులకు అర్థం కాలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి : ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.

 అమెజాన్ , ఫిల్ప్ కార్ట్ సంస్థలకు సూపర్ పంచ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..అది ఏంటంటే..?:Supreme Court To Amazon, Flipkart.

 అప్పుడు గంగమ్మ.. ఇప్పుడు శివయ్య ప్రత్యక్షం..ఇది దేవుని మహిమే అంటున్న నెటిజన్లు..:Statue of Shiva Video.

 నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.