Coronavirus India: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో..
India Covid-19 Updates: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం
India Covid-19 Updates: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. సోమవారం భారీగా తగ్గిన కేసులు కాస్తా.. మంగళవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 38,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 497 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,036,511 కి పెరగగా.. మరణాల సంఖ్య 429179 కి చేరింది.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 40,013 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3.12 కోట్లకి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,86,351 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాదాపు 140 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 3.9 లక్షలకు దిగువన ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కాగా.. రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 53.24 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: