Drugs Seized: అనుమానం రాకుండా ప్లాన్.. షాంపూ బాటిళ్లల్లో రూ.53 కోట్ల డ్రగ్స్.. కట్‌చేస్తే సీన్ రివర్స్..
Heroin Seized At Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు ప్రయాణికుల
Heroin Seized At Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.53 కోట్ల విలువ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అరెస్టయిన ఇద్దరూ టెహ్రాన్ నుంచి దుబాయి మీదుగా భారత్‌కు వచ్చారని, ఆఫ్ఘానిస్తాన్ దేశస్తులని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా.. హెరాయిన్‌ను 30 కలర్ బాటిల్స్, రెండు షాంపూ బాటిళ్ల ద్వారా స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికి అనుమానం రాకుండా నిందితులు షాంపూ బాటిళ్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. ఈ వ్యవహారం బయటపడిందని అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు రూ.600 కోట్లకుపైగా విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు ఇప్పటివరకు14 కేసులు నమోదు కాగా.. 18 మంది విదేశీయులు, ఇద్దరు భారతీయులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: