AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Akhila priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

బోయిన్‌పల్లి పోలీసులు తమ ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకువెళ్లారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ కేబీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Bhuma Akhila priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
Bhuma Akhila Priya Husband Bhargavram
Balaraju Goud
|

Updated on: Aug 11, 2021 | 10:01 AM

Share

Bhuma Akhila priya complaint against Police: బోయిన్‌పల్లి పోలీసులు తమ ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకువెళ్లారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్‌ కేసులో భాగంగా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ చర్లపల్లి జైలుకి వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత జైలులో టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ (టీఐపీ)కి రావాల్సిందిగా జైలు అధికారులు ఇతనికి సమాచారం ఇచ్చారు. తనకు కోవిడ్‌ వచ్చిందని భార్గవ్‌రామ్‌ జైలు అధికారులకు రిపోర్ట్‌ పంపారు. అది నకిలీ అని తేలడంతో జూన్‌లో కేపీహెచ్‌బీలో ఉంటున్న భార్గవ్‌రామ్‌ని అరెస్ట్‌ చేసేందుకు బోయిన్‌పల్లి పోలీసులు వచ్చారు.

అయితే, పోలీసులు వచ్చిన సమయంలో భార్గవ్ రామ్ ఇంట్లో లేరు. తాము లేనప్పుడు బోయిన్‌పల్లి పోలీసులు ఇంట్లోని పలు డాక్యుమెంట్‌లు తీసుకెళ్లారంటూ మూడు రోజుల కిందట అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా బోయిన్‌పల్లి పోలీసులు అఖిలప్రియ ఇంటికి వచ్చి వెళ్లినట్లు దృశ్యాలు నమోదయ్యాయని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. బోయినపల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ… పరారీలో ఉన్న భార్గవ్‌రామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డి అఖిలప్రియ ఫ్లాట్‌లోనే ఉన్నట్లు తెలిసి వెళ్లడంతో భద్రతా సిబ్బంది అడ్డుకోగా కేసు నమోదు చేశామన్నారు.

ఇదిలావుంటే, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 5 అర్ధరాత్రి ముఖ్యమంత్రి దగ్గరి బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికార్లమంటూ ఇంటికొచ్చి..మాటల సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్‌ల పేర్లు ప్రస్తావించారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ముగ్గుర్నీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమేరాల ద్వారా డైమండ్ పాయింట్ రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాల్ని గుర్తించి..పట్టుకున్నారు.

Read Also…  AP Congress: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ ఫోకస్.. రేపు ముఖ్యనేతలతో విడివిడిగా చర్చలు!