Simhachalam Temple: సింహాచలంలో కూలిన సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభం.. సీసీ పుటేజ్ చూసి..
Dwajastambham fall down: విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని
Dwajastambham fall down: విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీ టీపీ పుటేజీ సహాయంతో కారణాలపై పరిశీలించారు. ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచుకున్న అనంతరం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చిపోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన ఉదయం 6.30గంటల సమయంలో జరిగినట్లు.. సీసీ టీవీ పుటేజీ పరిశీలన అనంతరం అధికారులు తెలిపారు.
అనంతరం వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ మీడియాకు వివరించారు. 60 ఏళ్లకు చెందిన ధ్వజస్తంభమని.. లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయినట్లు వివరించారు.
Also Read: