Watch Video: అయ్యో పాపం.. దారి తప్పి వచ్చిన చిరుత.. గ్రామస్తులంతా కలిసి ఏం చేశారో చూడండి..
హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దారితప్పి పొలాల్లోకి వచ్చిన ఒక చిరుతపులిని చూసిన జనాలు భయపడిపోయి దాన్ని తరిమేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ చిరుతపులి ముగ్గురు గ్రామస్తులపై దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుత దాడిలో గాయపడిన గ్రామస్తులు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కమర్‌పూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అడవుల్లోంచి ఒక చిరుత దారితప్పి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చింది. చిరుతను చూసిన జనాలు భయంతో దాన్నిఅక్కడి నుంచి తరమేసేందుకు కర్రలు, ఇనుపరాడ్‌లతో దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భయపడిపోయిన చితరు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వారిపై దాడి చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న రెండు కుక్కలు ఆ చిరుతను వెంబడించడం మనం వీడియోలో చూడవచ్చు.
అయితే చిరుత దాడిలో ముగ్గురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీందో గ్రామస్తులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ఈ చిరుతపులులు తరచూ పొలాల్లోకి వస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయని.. వాటి సంచారంతో స్థానిక జనాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా చిరుత గ్రామస్తులపై దాడి చేసిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
దారి తప్పి గ్రామంలోకి వచ్చిన చిరుతలపై గ్రామస్తులు దాడి చేశారు. కానీ ఇది నిజంగా వాటి తప్పే అని మనం చెప్పగలమా..మనం ఇప్పటికే వారి అడవులను లాక్కున్నాము, వాటి భూములను చదును చేస్తున్నాము..అలాంటి సందర్భాల్లో మన ప్రపంచంలోకి వచ్చిన వాటిని అర్థం చేసుకోవడానికి బదులు మనం వాటిపై దాడికి పాల్పడుతున్నాము.. ఇదెక్కడి న్యామని ఒక యూజర్ రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
