AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student: నన్ను ఎవరూ ప్రేమించడం లేదంటూ అమ్మాయి ఆత్మహత్య.. డైరీలో అది చూసి అంతా షాక్..

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం వెలుగు చూసింది. ఓ కాలేజీ విద్యార్థిని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె డైరీలో లభించిన సూసైడ్ లెటర్ చదివి అంతా షాక్ అయ్యారు. తనను ఎవరూ ప్రేమించడం లేదని

Student: నన్ను ఎవరూ ప్రేమించడం లేదంటూ అమ్మాయి ఆత్మహత్య.. డైరీలో అది చూసి అంతా షాక్..
Student
Shiva Prajapati
|

Updated on: Dec 20, 2022 | 7:00 AM

Share

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం వెలుగు చూసింది. ఓ కాలేజీ విద్యార్థిని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె డైరీలో లభించిన సూసైడ్ లెటర్ చదివి అంతా షాక్ అయ్యారు. తనను ఎవరూ ప్రేమించడం లేదని, తన లైఫ్ ఇక వేస్ట్ అని భావించి ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కోల్‌కతాలోని నక్తలా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ కారణంగా అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కాగా, ఈ విషాదానికి సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలాన్నాయి. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి రౌనక్ అహ్మద్.. కోల్‌కతాలోని లేడీ బ్రబౌర్న్ కాలేజీలో డిగ్నీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి నక్తలా ప్రాంతంలో నివసిస్తోంది. అయితే, సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో రౌనక్‌ను పిలవడానికి ఆమె తల్లి వెళ్లింది. అయితే, ఎంతకీ గది తలుపు తెరవలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దాంతో తలుపులు పగలగొట్టారు. కళ్ల ముందు విషాద దృశ్యం కనిపించింది. అమ్మాయి విగత జీవిగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. వెంటనే నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కాగా, అమ్మాయి డెడ్ బాడీ పక్కన లభించిన డైరీలో సూసైడ్ నోట్ రాసి ఉంది. ‘ఎవరూ నన్ను ప్రేమించడం లేదు. ఇక నేను ఏమీ చేయలేను’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. అది గమనించిన పోలీసులు.. తనను ఎవరూ ప్రేమించడం లేదనే కారణంగా ఒత్తిడికి గురై అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, ఆదివారం రాత్రి ఆ అమ్మాయి బాగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందరూ కలిసి కూర్చుని ఫుల్‌బాల్ ప్రపంచ కప్ మ్యాచ్‌ని వీక్షించించారని చెబుతున్నారు. అందరూ కలిసి డిన్నర్ కూడా చేశామన్నారు. రాత్రి బాగానే ఉండి.. ఉదయానికే ఇలా ఘోరానికి పాల్పడిందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ