Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant Cases: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. 153కి చేరిన బాధితుల సంఖ్య

Omicron variant India Updates: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ

Omicron Variant Cases: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. 153కి చేరిన బాధితుల సంఖ్య
Omicron Variant
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2021 | 10:09 AM

Omicron variant India Updates: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 153కి పెరిగింది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్‌ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది.

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్ఓ సూచనలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్రం సూచించింది.

దేశంలో 82,267 యాక్టివ్ కరోనా కేసులు దేశంలో గత 24 గంటల్లో 6,563 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 132 మంది మరణించారు. దీంతోపాటు నిన్న 8,077 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 82,267 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 34187017కి చేరగా.. మరణాల సంఖ్య 4,77,554కి పెరిగింది.

Also Read:

Omega 3 Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Sore Throat Home Remedies: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి చాలు..