Sore Throat Home Remedies: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి చాలు..

Sore Throat Home Remedies : చలికాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు జలుబు-దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటితోపాటు

Sore Throat Home Remedies: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి చాలు..
Sore Throat Home Remedies.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2021 | 9:42 AM

Sore Throat Home Remedies : చలికాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు జలుబు-దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటితోపాటు జ్వరం, పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటాయి. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో పలు ఆహార పదార్థాలను పాటిస్తే.. ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఇబ్బందుల్లో గొంతునొప్పి ఒకటి. జలుబు, దగ్గుతోపాటు గొంతునొప్పి చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. ఆ హోం రెమిడిస్ ఎంటో ఇప్పుడు చూద్దాం..

తేనె దగ్గు లేదా గొంతులో మంట, తీవ్రమైన నొప్పితో బాధపడేవారు.. ఒక చెంచా తేనె తినడం చాలామంచింది. ఇలా తేనెను నేరుగా తినలేకపోతే.. పాలలో లేదా నీటిలో పసుపుతో కలపుకొని తాగవచ్చు. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ గొంతుకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు శరీరానికి అవసరమైన పలు ఔషధాలు అందుతాయి.

పుదీనా లేదా చమోలి టీ  దగ్గు, గొంతు నొప్పితో బాధపడే వారు.. యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఈ టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పుదీనా, చమోలి టీ గొంతు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఔషధంగా పనిచేసి.. పలు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మెంతులు మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గొంతు నొప్పికి మెంతి టీ సహజసిద్ధమైన ఔషధం. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటితోపాటు అలసట, చికాకు, వాపుకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మెంతుల్లోని యాంటీ ఫంగల్ గుణాలు.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వేడి పానీయాలు దాల్చిన చెక్క టీ, అల్లం-తులసి టీ, నిమ్మకాయ తేనె టీ లేదా, మసాలా టీ వంటివి మీ గొంతుకు మేలు చేస్తాయి. ఈ వేడి పానీయాలు మీ గొంతును తక్షణంగా ఉపశమనం కలిగిస్తాయి.

Also Read:

Omega 3 Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Turmeric Tea: శీతాకాలంలో ఈ టీ తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకే..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!