Omega 3 Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Omega 3 Fatty Acids Health Benefits: ఉరుకుపరుగుల జీవితంలో.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ ఆహార పదార్థాల్లో పోషకాలతోపాటు..

Omega 3 Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..
Omega 3 Fatty Acids
Follow us

|

Updated on: Dec 20, 2021 | 8:47 AM

Omega 3 Fatty Acids Health Benefits: ఉరుకుపరుగుల జీవితంలో.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ ఆహార పదార్థాల్లో పోషకాలతోపాటు.. కొవ్వులు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. మంచి కొవ్వుల విభాగంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉత్పత్పి కావు. కానీ అవి కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నుంచే లభిస్తాయి. పండ్ల నుంసీ కూరగాయలు, సముద్రపు ఆహారం వరకు మన ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకాలను చేర్చుకోవడం చలాముఖ్యం. అలాంటి ఆహారపదార్థాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒకటి. ఈ పోషకాలు మెదడు, గుండెతో సహా శరీరంలోని ముఖ్యమైన భాగాలకు ప్రయోజనకరంగా ఉంటాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ఒమేగా 3 అని కూడా పిలుస్తారు. శరీరంలో కొవ్వు అనేక రూపాల్లో ఉంటుంది. వీటిలో ఒకటి కొవ్వు ఆమ్లం, ఇది శరీరానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలలో ఒకటి. ఒమేగా-3 మెదడు, కళ్లకు చాలా అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ప్రయోజనాల గురించి తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకోండి.

మానసిక ఆరోగ్యానికి.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లేకపోవడం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పెంచుతుందని ఆధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు.

వాపును తగ్గిస్తాయి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా శరీరంలోని వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

కళ్లకు మేలు..  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కళ్ళకు చాలా మేలు చేస్తాయి. నేటి కాలంలో.. గాడ్జెట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితిలో.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని తినండి. కంటి సంరక్షణలో ఎటువంటి లోపం ఉన్నా ఇవి పరిష్కరిస్తాయి.

చర్మానికి ఉత్తమమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ సమస్యలతో పోరాడటానికి కూడా సహాయపడతాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నేటి కాలంలో పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయంతో గుండెపోటును నివారించవచ్చు. దీనితో పాటు, ఇది గుండెకు సంబంధించిన సమస్యలను కలిగించే అనేక అంశాలను కూడా నియంత్రిస్తుంది.

Also Read:

Turmeric Tea: శీతాకాలంలో ఈ టీ తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకే..

Health Tips: మీ వయస్సు 30 ఏళ్లు దాటిందా? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!