Health Tips: మీ వయస్సు 30 ఏళ్లు దాటిందా? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
Health Tips: వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీకు కూడా 30 ఏళ్లు దాటితే మీ జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రస్తుత కాలంలో మన శరీరం
Health Tips: వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీకు కూడా 30 ఏళ్లు దాటితే మీ జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రస్తుత కాలంలో మన శరీరం, ఆరోగ్యం, మనస్సులో తేడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. 30 ఏళ్ల లోపు లేదా తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతల ఒత్తిడి కారణంగా శరీరంలోనూ అనేక మార్పులు సంభవిస్తాయి. మరి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం జీవన శైలిలో మార్పులు తప్పనిసరి. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రకోలీ.. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే బ్రకోలీ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు బ్రకోలీతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దీనిని వండుకుని తినొచ్చు, సలాడ్ లాగా కూడా తినొచ్చు.
విటమిన్ సి.. విటమిన్ సి కలిగిన పండ్లను తినడం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ సి ఫుడ్ తింటే శరీర బరువు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీ పొట్ట నిండుగా ఉంటుంది. దీని కారణంగా అతిగా తినడం కూడా నివారించవచ్చు. ఎంత తేలికైన ఆహారం తీసుకుంటే శరీరానికి అంత మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా పెద్ద మొత్తంలో తినకూడదని గుర్తుంచుకోండి.
వెల్లుల్లి.. వెల్లుల్లి శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దాని సహాయంతో, శరీరంలోని బ్యాక్టీరియాను చంపవచ్చు. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
చేప.. నాన్ వెజ్ మీకు ఇష్టమైతే చేపలను తినడం మంచిది. చికెన్, మటన్ కూడా ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
తేనె.. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. నిమ్మరసం తేనె కలిపి తాగొచ్చు. ఇది విటమిన్ సి లోపాన్ని కూడా తీరుస్తుంది.
Also read: