Children Health Care: చలికాలం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రైట్స్ తినిపించండి..!
Winter Health Care: చలికాలంలో పిల్లలు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు మందులే కాదు.. ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయి.
Winter Health Care: చలికాలంలో పిల్లలు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు మందులే కాదు.. ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా వారు తినే ఆహారమే వారికి శ్రీరామ రక్షగా పని చేస్తుంది. చలికాలంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇక శీతాకాలానికి తోడు.. కరోనా మహమ్మారి కూడా అందరినీ భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో రోగ నిరోధక శక్తి తప్పనిసరి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా సక్రమంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలనే తినాల్సి ఉంటుంది. మరి అలాంటి ఆహార పదార్థాల్లో డ్రై ఫ్రూట్స్‌ది ప్రథమ స్థానం అని చెప్పాలి. మరి చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడే డ్రై ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం.. డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం తినడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు నిపుణులు. రోజూ పిల్లలకు బాదంపప్పు తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. బాదంపప్పులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదంపప్పులను పిల్లలకు రోజూ ఇవ్వండి.
చిల్‌గోజా.. చిల్‌గోజాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు A, E, B1, B2, C, కాపర్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. రక్త హీనతను తగ్గిస్తుంది. పిల్లలకు రోజూ 2 నుండి 3 చిల్‌గోజా లను తినిపిస్తే చలికాలంలో వారు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.
వాల్‌నట్.. బ్రెయిన్ ఫుడ్ అని పిలిచే వాల్ నట్స్ లో శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు కూడా ఉన్నాయి. అక్రోట్లు, B1, B2, B6 ఉంటాయి. చలిలో పిల్లలకు వాల్‌నట్‌లను తినిపించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పిస్తా.. పిస్తాలో ఇనుము, పొటాషియం, రాగి, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిస్తాపప్పు తినడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
Also read: