Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..

పాకిస్తాన్ వాయువ్య భాగంలో, పాకిస్తాన్.. ఇటాలియన్ పురావస్తు శాస్త్రజ్ఞుల సంయుక్త బృందం బౌద్ధ కాలానికి సమబంధించిన 2,300 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు.

Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..
Oldest Buddha Temple In Pakistan
Follow us
KVD Varma

|

Updated on: Dec 19, 2021 | 3:25 PM

Buddha Temple in Pakistan: పాకిస్తాన్ వాయువ్య భాగంలో, పాకిస్తాన్.. ఇటాలియన్ పురావస్తు శాస్త్రజ్ఞుల సంయుక్త బృందం బౌద్ధ కాలానికి సమబంధించిన 2,300 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. దీనితో పాటు మరికొన్ని విలువైన కళాఖండాలు కూడా ఈ తవ్వకాల్లో లభ్యమయ్యాయి. ఈ ఆలయం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలోని బరికోట్ తహసిల్‌లోని బౌద్ధ కాలం నాటి బజీరా నగరంలో ఉనికిలోకి వచ్చింది. ఈ ఆలయం పాకిస్థాన్‌లోని బౌద్ధుల కాలం నాటి పురాతన దేవాలయంగా చెబుతున్నారు. ఈ విషయమై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, “పాకిస్తాన్, ఇటలీ పురావస్తు శాస్త్రవేత్తలు వాయువ్య పాకిస్థాన్‌లోని చారిత్రక ప్రదేశంలో సంయుక్త తవ్వకాలలో 2,300 సంవత్సరాల పురాతన బౌద్ధ దేవాలయాన్ని కనుగొన్నారు.” ఇది కాకుండా, ఇతర విలువైన కళాఖండాలు కూడా ఇక్కడ కనిపించాయి. స్వాత్‌లో కనుగొన్న ఈ ఆలయం పాకిస్తాన్‌లోని తక్షిలాలో కనిపించే దేవాలయాల కంటే పురాతనమైనదని అధికారులు చెబుతున్నారు.

2700 పైగా కళాఖండాలు..

ఆలయంతో పాటు, పురావస్తు శాస్త్రవేత్తలు గ్రీస్ రాజు మినాందార్ కాలం నుంచి ఖరోష్ఠి భాషలో రాసిన నాణేలు, ఉంగరాలు, పాత్రలు,వస్తువులతో సహా 2,700 కంటే ఎక్కువ ఇతర బౌద్ధ కళాఖండాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాత్ జిల్లాలోని చారిత్రాత్మక నగరం బజీరాలో త్రవ్వకాలలో మరిన్ని పురావస్తు ప్రదేశాలను కనుగొనవచ్చని ఇటాలియన్ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని ఇటాలియన్ రాయబారి ఆండ్రీ ఫెరారిస్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ మతాలకు పాకిస్థాన్‌లోని పురావస్తు ప్రదేశాలు చాలా ముఖ్యమైనవని చెప్పారు.

ఇంతకు ముందు కూడా..

2020 సంవత్సరం ప్రారంభంలో, పాకిస్తాన్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో విష్ణు ఆలయ సముదాయం అవశేషాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ అప్పుడు కూడా స్వాత్ ప్రాంతంలోనే జరిగింది. ఈ అవశేషాలలో కనీసం 1000 సంవత్సరాల నాటి హిందూ దేవాలయం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆలయాన్ని పాకిస్తాన్, ఇటలీ (విష్ణు దేవాలయం పాకిస్తాన్) నుంచి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు. ఈ ఆలయం బారికోట్ గుండై కొండల మధ్య త్రవ్వకాల సమయంలో కనుగొన్నారు. ఆ సమయంలో ఖైబర్ పఖ్తుంఖ్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్ ఖలిక్ ఈ ఆలయం విష్ణుమూర్తికి చెందినదని చెప్పారు. ఈ ఆలయాన్ని హిందూ రాజుల కాలంలో నిర్మించారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Jojoba Oil: అందమైన జుట్టుకోసం జోజోబా అయిల్.. సమస్యలన్ని మటుమాయం..

ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..

Health Tips: వీటిని అధికంగా తీసుకుంటున్నారా.. అయితే, మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే