Jojoba Oil: అందమైన జుట్టుకోసం జోజోబా అయిల్.. సమస్యలన్ని మటుమాయం..

Jojoba Oil: జుట్టు సంరక్షణకు ఆయిల్ మసాజ్ చాలా ముఖ్యం. ఇలా చేస్తే చుండ్రు, పొడి జుట్టు, పెళుసు జుట్టు, జుట్టు రాలడం, చివర్లు చీలిపోవడం

Jojoba Oil: అందమైన జుట్టుకోసం జోజోబా అయిల్.. సమస్యలన్ని మటుమాయం..
Jojoba Oil
Follow us

|

Updated on: Dec 19, 2021 | 2:49 PM

Jojoba Oil: జుట్టు సంరక్షణకు ఆయిల్ మసాజ్ చాలా ముఖ్యం. ఇలా చేస్తే చుండ్రు, పొడి జుట్టు, పెళుసు జుట్టు, జుట్టు రాలడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. కొబ్బరి నూనె, ఆర్గాన్ ఆయిల్, అవకాడో ఆయిల్, రోజ్‌షిప్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా మంచివి. ఇవి జుట్టును హైడ్రేట్ చేస్తుంది మాయిశ్చరైజ్ చేస్తుంది. మీరు జుట్టు కోసం జోజోబా నూనెను కూడా అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.

1. జోజోబా నూనె అప్లై చేయండి కొంచెం జొజోబా ఆయిల్ తీసుకుని తలకు, జుట్టుకి అప్లై చేయాలి. మీ వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 30-40 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం తేలికపాటి షాంపూతో కడిగేయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

2. జోజోబా నూనె, ఆలివ్ నూనె ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ తీసుకొని మిక్స్ చేయాలి. ఈ నూనె మిశ్రమాన్ని జుట్టు, తలపై అప్లై చేయాలి. తేలికపాటి చేతులతో కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయలి. తర్వాత, 20-30 నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. జుట్టు కడగడానికి తేలికపాటి షాంపూ వాడాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు చిట్లకుండా ఉంటుంది.

3. జోజోబా ఆయిల్ నిమ్మరసం నిమ్మకాయ తీసుకుని దానిని సగానికి కట్ చేయాలి. సగం నిమ్మకాయ రసాన్ని తీసి 2-3 టేబుల్ స్పూన్ల జోజోబా నూనెలో కలపాలి. దీన్ని తలకు బాగా మసాజ్ చేయడానికి ఉపయోగించాలి. 30-40 నిమిషాల పాటు తలపై ఆరనివ్వాలి. తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే జట్టు మెరుస్తూ కనిపిస్తుంది.

4. జోజోబా ఆయిల్, అరటి ఒక గిన్నెలో రెండు పండిన అరటిపండ్లను మెత్తగా చేయాలి. దానికి 2 టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్ కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ని మీ హెయిర్‌పై పూర్తిగా అప్లై చేయాలి. తల మొత్తాన్ని షవర్ క్యాప్‌తో కప్పి, 30-40 నిమిషాలు ఆరనివ్వాలి. సాధారణ నీరు, తేలికపాటి షాంపూతో కడగాలి. దీన్ని వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..

E-shram కార్డ్‌తో ప్రయోజనాలేంటి..? ఇది ఎలా పొందాలి.. దీనికి ఎవరు అర్హులు తెలుసుకోండి..

చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ తినండి.. కానీ మితిమీరితే శరీరానికి హాని.. ఎలాగో తెలుసా..?