Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉండాలి.. అదృష్టం, సంతోషం అన్నీ మీ వెంటే..
Vastu Tips: సంవత్సరంలో చివరి నెల కొనసాగుతోంది. ప్రజలు ప్రతిసారీ కొత్త సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే గత సంవత్సరంలో
Vastu Tips: సంవత్సరంలో చివరి నెల కొనసాగుతోంది. ప్రజలు ప్రతిసారీ కొత్త సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే గత సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలు ఈ సంవత్సరంలో ఉండొద్దని కోరుకుంటారు. కొత్త సంవత్సరంలో తమ జీవితం ఆనందంతో వెల్లివిరియాలని ఆశిస్తారు. మీరు కూడా రాబోయే సంవత్సరం ఆనందంగా ఉండాలంటే కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. ఇవి మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ పురోగతి, సంపద, ఆనందం, శ్రేయస్సు మీరు తీసుకునే వాస్తు చర్యలపై ఆధారపడి ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఏ వస్తువులు తీసుకువస్తే శుభం కలుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం.
1. లోహంతో చేసిన తాబేలు లోహంతో చేసిన తాబేలు ఇంటికి శుభప్రదమని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉత్తరం వైపున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు. ఆనందం, శ్రేయస్సు మీ వెంటే ఉంటుంది.
2. గోమతీ చక్రం గోమతీ చక్రం నెగటివ్ శక్తులను నివారించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శ్రేయస్సు, సంతోషం, మంచి ఆరోగ్యం, సంపద, మానసిక ప్రశాంతత అందిస్తుంది. వాస్తు ప్రకారం గోమతీ చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టి ఖజానాలో ఉంచవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో శుభం కలుగుతుంది.
3. పిరమిడ్ పిరమిడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తుంది. దీని సహాయంతో మీరు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. పిరమిడ్ తన చుట్టూ ఉన్న వస్తువుల లక్షణాలను మార్చగలదని అంటారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇంట్లో తప్పకుండా పిరమిడ్లను తీసుకురావాలి.
4. ముత్యాల శంఖం ముత్యాల శంఖం ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీరు వాస్తు సూచనలను పాటిస్తే ముత్యపు శంఖాన్ని భద్రంగా ఉంచి పూజించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి.
5. తులసి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని కొనసాగించడానికి నూతన సంవత్సరం సందర్భంగా తులసి మొక్కను నాటండి. ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదమని చెబుతారు.