Cricket News: తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టుని గెలిపించాడు.. 30 నిమిషాల్లో మ్యాచ్ ముగించేశాడు..
cricket news: టీ 20 చరిత్రలో రికార్డ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అదే జాబితాలో మరో ఇన్నింగ్స్ నమోదైంది. న్యూజిలాండ్‌కు చెందిన 28 ఏళ్ల వికెట్ కీపర్
cricket news: టీ 20 చరిత్రలో రికార్డ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అదే జాబితాలో మరో ఇన్నింగ్స్ నమోదైంది. న్యూజిలాండ్‌కు చెందిన 28 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 నిమిషాలు.. అంతే మ్యాచ్ ముగించేశాడు. వెల్లింగ్టన్ పిచ్‌పై తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫీల్డర్లు కేవలం ప్రేక్షకుల పాత్ర పోషించారు. బ్యాట్‌తో రచ్చ సృష్టించిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్యామ్ ఫ్లెచర్. న్యూజిలాండ్ టీ20 లీగ్ సూపర్ స్మాష్‌లో ఈ ఇన్నింగ్స్ ఆడాడు.
సూపర్ స్మాష్‌లో భాగంగా వెల్లింగ్టన్ వర్సెస్ కాంటర్‌బరీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాంటర్‌బరీ జట్టుకు ఫ్లెచర్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ వెల్లింగ్టన్ నుంచి అత్యధికంగా 32 పరుగులు చేశాడు. అదే సమయంలో, మాట్ హెన్రీ, నట్టల్ కాంటర్బరీ అత్యంత విజయవంతమైన బౌలర్లు ఎందుకంటే తలా 3 వికెట్లు పడగొట్టారు.
28 ఏళ్ల బ్యాట్స్‌మెన్ బౌలర్లను చిత్తు చేశాడు కాంటర్‌బరీకి ఇప్పుడు 152 పరుగులు చేయడం సవాలుగా మారింది. ఈ లక్ష్యాన్ని 17వ ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాంటర్‌బరీ తరఫున ఓపెనర్ చాడ్ బోడ్జ్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కానీ మైదానంలోకి వచ్చి కేవలం 31 నిమిషాలలో మ్యాచ్‌ని ముగించింది మాత్రం ఫ్లెచర్. వెల్లింగ్టన్ జట్టుకి చెందిన 6గురు బౌలర్లను ఊచకోత కోశాడు.
31 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది క్యామ్ ఫ్లెచర్ తన 31 నిమిషాల బ్యాటింగ్‌లో 28 బంతులు ఎదుర్కొని అజేయంగా 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే,దాదాపు 182 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఫ్లెచర్ వేగవంతమైన ఇన్నింగ్స్ ఫలితంగా కాంటర్‌బరీ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండో విజయాన్ని నమోదు చేసింది. టీ20ల్లో క్యామ్ ఫ్లెచర్‌కి ఇది ఆరో ఫిఫ్టీ. దీంతో ఇప్పటి వరకు ఆడిన 72 టీ20 మ్యాచుల్లో 1343 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ దాదాపు 130. అతని అత్యధిక స్కోరు అజేయంగా 74.