Viral Video: చేపల కోసం వల వేస్తే.. ఎన్నో ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్.. అవాక్కైన మత్స్యకారులు!
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదుష్టవంతుడిని ఎవరు బాగు చేయరన్నట్లు.. అదృష్టం ఉంటే ఎందో రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది.
Iphones and Macbooks in in Fisherman net: అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదుష్టవంతుడిని ఎవరు బాగు చేయరన్నట్లు.. అదృష్టం ఉంటే ఎందో రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. తాజాగా ఇలాంటి ఘటననే ఓ మత్స్యకారుడిని కోటీశ్వరుడిని చేసింది. ఇండోనేషియాలో కాసంబాస్ ఇంటిని నడిపే మత్స్యకారుడి విషయంలో నషీబా ఏం ఇచ్చిందో చూసి అందరూ షాక్ అయ్యారు. అతను రోజులాగానే పడవను తీసుకుని సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం వల విసిరాడు. అయితే. ఆ వలలో చిక్కుకున్న లక్షలు విలువ చేసే యాపిల్ ఫోన్ ఉత్పత్తులు చిక్కాయి. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.
ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. జీవితం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఎప్పటిలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పట్టేందుకు వల కూడా వేశాడు. కొంత సేపటికి వల బరువెక్కడంతో జాలరి తనకు ఏదో గట్టి వస్తువు తగిలిందని ఊహించి అప్రమత్తమయ్యాడు. తర్వాత నెట్ లాగడం మొదలుపెట్టాడు. వల మొత్తం లాగిన తర్వాత వలకి చిక్కిన విషయం చూసి అశ్చర్యపోయాడు. ఈ వలలో చేపలు చిక్కుకోలేదు, అయితే కొన్ని పెట్టెలు వలలో చిక్కుకున్నాయి. అతను ఈ పెట్టెలను తెరవడం ప్రారంభించాడు. దానిలో చాలా పెట్టెలు ఉన్నాయి. దానిపై ఆపిల్ లోగో ఉంది. మొదట్లో పెట్టె ఖాళీ అయిపోతుందని భావించి, దాన్ని తెరిచే సరికి అవాక్కయ్యారు.
దీని తర్వాత మత్స్యకారుడు ఈ సంఘటన యొక్క వీడియోను టిక్‌టాక్‌లో పంచుకున్నాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ, మత్స్యకారుడు ‘అసే పల్టీ హై కిస్మత్’ అని రాశాడు, ఈ సంఘటన గురించి తెలిసిన వారందరూ ఆశ్చర్యపోయారు. పెట్టెలో ఉంచిన ఉత్పత్తులు నీటి వల్ల పాడైపోలేదని మత్స్యకారుడు వీడియోలో చెప్పాడు. డబ్బాల ప్యాకింగ్ చాలా బాగా జరిగిందని, సరుకులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. పెట్టెలో నీరు లేదని మత్స్యకారులు తెలిపారు. వస్తువులు ఏవీ పాడవకుండా ప్యాకింగ్ చాలా బాగా చేశారన్నారు.
అయితే, యాపిల్ లోగో పెట్టెపై ఉంది కాబట్టి అందులో తప్పనిసరిగా ఐఫోన్ ఉండి ఉండవచ్చని మత్స్యకారుడు భావించాడు. మొదల ఖాళీ పెట్టెలు అయివుంటాయని అనుకున్నాడు. అయితే, వాటిని మెల్లగా సీల్ తీసి పెట్టె తెరిచిన తర్వాత, మత్స్యకారుడు తన కళ్లను నమ్మలేకపోయాడు. బాక్స్ లోపల వివిధ ఆపిల్ ఉత్పత్తులు ఉన్నాయి. పెట్టెలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ఉండటాన్ని మత్స్యకారుడు గమనించాడు.
ఆపిల్ ఉత్పత్తులు నీటిలో ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. ఐఫోన్ నీటి నుండి ఎలా బయటపడుతుంది? నీటిలో ఐపోన్ చెడిపోకుండా ఉంటుందా? మీ ప్రశ్న నిజమే! మత్స్యకారులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు మత్స్యకారుడు చెప్పిన విషయాలు మరింత గందరగోళంగా ఉన్నాయి. చేపలు పట్టే వలల్లో దొరికిన యాపిల్ బాక్సులను చాలా గట్టిగా ప్యాక్ చేయడంతో పెట్టె లోపల చుక్క నీరు కూడా పోలేదు. పెట్టెలన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పబడి ఉన్నాయి. ఇది బాక్స్ లోపల అన్ని ఆపిల్ ఉత్పత్తులను రక్షణగా ఉందని మత్స్యకారుడు తెలిపాడు.
నిజానికి ఈ మత్స్యకారుడు యాపిల్ వస్తువులను సంపాదించిన తీరు ఇంతకు ముందు మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన US ( అమెరికా) ఫ్లోరిడాలో జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితుడితో సరదాగా గడిపేందుకు అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఇలాంటి ప్యాకెట్లు కొన్ని నీటిలో తేలుతూ కనిపించాయి. అనంతరం ఆ ప్యాకెట్లలో 30 కిలోల కొకైన్ ఉన్నట్లు తేలింది. దీని ప్రపంచ మార్కెట్ విలువ దాదాపు రూ.7.5 కోట్లు.