AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..

చలికాలం మొదలైంది. చలిగాలులతో బయటకు వెళితే వెచ్చని దుస్తులు తప్పనిసరిగా మారిపోయాయి.  సాయంత్రం అయ్యే సరికి చలిగాలులు మొదలు అవుతున్నాయి.. దీంతో రాత్రి అయ్యేసరికి ఇల్లంతా చల్లగా అయిపోతోంది.

Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..
Room Heaters
KVD Varma
|

Updated on: Dec 19, 2021 | 4:13 PM

Share

Room Heaters: చలికాలం మొదలైంది. చలిగాలులతో బయటకు వెళితే వెచ్చని దుస్తులు తప్పనిసరిగా మారిపోయాయి.  సాయంత్రం అయ్యే సరికి చలిగాలులు మొదలు అవుతున్నాయి.. దీంతో రాత్రి అయ్యేసరికి ఇల్లంతా చల్లగా అయిపోతోంది. రాత్రి నిద్రపోయేటప్పుడు చలిగాలికి చాలామందికి నిద్ర పట్టదు. దుప్పటి కప్పుకున్నా చలి ఆగే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా పెద్ద వయసు వారికి రగ్గు వంటివి కప్పుకున్నా కానీ చలిని తట్టుకోలేరు. ఎందుకంటే.. గది మొత్తం చల్లగా అయిపోవడంతో ఆ ప్రభావం మనం కప్పుకునే దుప్పటి మీదా పడుతుంది. దీంతో దుప్పటి కూడా చల్లగా అయిపోతుంది. అందువల్ల దుప్పటి కూడా చలి నుంచి కాపడలేదు. దీనిని ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఉంది.

శీతలాన్ని నివారించడానికి, వెచ్చని దుస్తులు.. దుప్పట్లతో పాటు హీటర్ చాలా ముఖ్యమైనది. చలి ఎక్కువగా ఉన్న సమయంలో, బ్లోవర్ హీటర్లు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. వాటి నుంచి వేడి గాలి బయటకు వస్తుంది. ఇది గది ఉష్ణోగ్రతను వేగంగా పెంచుతుంది. ఇది గదిలో ఉన్న ప్రతి ఒక్కరికీ వెచ్చని గాలి అనుభూతిని కలిగిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు పెద్ద వయసు ఉన్న వారికీ రూమ్ హీటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు మీకోసం ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న 5 బ్లోయర్‌లను గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వీటి ధర 1000 రూపాయల కంటే తక్కువ.

1. ఫిలో ఎలక్ట్రిక్ హీటర్

ధర: రూ. 779

మీరు ఈ పోర్టబుల్ బ్లోవర్ హీటర్‌ను 1000w నుంచి 2000w వరకు మోడల్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఫ్యాన్ వేగం నాబ్ సహాయంతో నియంత్రించవచ్చు. ఇందులో, వేగాన్ని 3 స్థాయిల వరకు పెంచవచ్చు. దీనిలో రెండు స్విచ్ లు ఉంటాయి. వేడి గాలి రెండవ స్విచ్ నుంచి నియంత్రించవచ్చు. దీని కోసం కూడా 2 స్థాయిలు ఇందులో ఇచ్చారు. దీని బాడీ ప్లాస్టిక్‌తో తయారైంది. అందువల్ల విద్యుదాఘాతం ప్రమాదం లేదు.

2. లైఫ్ లాంగ్ 2000 LLFH03

ధర : రూ. 849

లైఫ్‌లాంగ్ కంపెనీకి చెందిన ఈ 2000 వాట్ల బ్లోవర్ హీటర్ ధర రూ. 849. దీని మోడల్ నంబర్ LLFH03. దీనిలో వేడి గాలి వీచే ఫ్యాన్ ఉంది. ఇది వేడి గాలి కోసం 3 మోడ్‌లను కలిగి ఉంది. అంటే, మీరు గాలి వేడిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. దీనిపై కంపెనీ 12 నెలల వారంటీ కూడా ఇస్తోంది. దీని బాడీ కూడా ప్లాస్టిక్ తో తయారైంది.

3. రియాకర్ హోమ్ హీట్ బ్లోవర్

ధర: రూ. 849

ఈ రూమ్ హీటర్ బ్లోవర్ మోడల్ నంబర్ M-11 432. ఇది 2000 వాట్ల విద్యుత్ వినియోగాన్ని చేస్తుంది. దీని డిజైన్ నిలువుగా ఉంటుంది. దీని కారణంగా, ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. దీనికి రెండు స్విచ్ లు ఉంటాయి. ఫ్యాన్ వేగం నాబ్ సహాయంతో నియంత్రించవచ్చు. ఇందులో, వేగాన్ని 3 స్థాయిల వరకు పెంచవచ్చు. అదే సమయంలో, వేడి గాలి రెండవ నాబ్ నుంచి నియంత్రించవచ్చు. వేడి గాలి కోసం కూడా రెండు స్థాయిలు ఉన్నాయి.

4. కేన్వి  US ఫ్యాన్ హీటర్

ధర: రూ.849

తక్కువ ధర ఉన్నప్పటికీ, ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ డ్యూయల్ కలర్ టోన్ హీటర్ బ్లోవర్ మోడల్ నంబర్ M-11 432. వేడి గాలిని నియంత్రించడానికి, దానిలో అనేక స్థాయిలు ఇచ్చారు. అదే విధంగా, ఫ్యాన్ వేగం కోసం మూడు స్థాయిలు కూడా ఉన్నాయి. కంపెనీ దీనిపై ఒక-సీజన్ వారంటీని కూడా ఇస్తోంది. ఇది 2000 వాట్ల విద్యుత్ వినియోగాన్ని చేస్తుంది. ఇది ISO 9001:2015 సర్టిఫికేట్ కూడా పొందింది.

5. జిగ్మా బ్లోవర్ హీటర్

ధర: రూ. 923

ఈ బడ్జెట్ బ్లోవర్ హీటర్ మోడల్ నంబర్ Z-1136. ఇది 2000 వాట్ల విద్యుత్ వినియోగాన్ని చేస్తుంది. ఈ గోల్డెన్ కలర్ హీటర్‌లో కాపర్ వైర్ మోటార్ ఇచ్చారు. ఇది భద్రత కోసం థర్మల్ కట్ ఆఫ్.. ఓవర్ హీటింగ్ రక్షణను కూడా కలిగి ఉంది. ఇందులో, హీట్ సెట్టింగ్ 1000 వాట్స్ కూడా చేయవచ్చు. దీనికి రెండు గుబ్బలు ఉన్నాయి. ఫ్యాన్ వేగం నాబ్ సహాయంతో నియంత్రించవచ్చు. ఇందులో, వేగాన్ని 3 స్థాయిల వరకు పెంచవచ్చు. అదే సమయంలో, వేడి గాలి రెండవ నాబ్ నుండి నియంత్రణ చేయవచ్చు. గమనిక: ఇక్కడ పేర్కొన్న ఈ మోడల్స్ అన్నీ ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి తీసుకున్నవి. వేర్వేరు ఆన్లైన్ అమ్మకాల సైట్ లలో వీటి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి: Jojoba Oil: అందమైన జుట్టుకోసం జోజోబా అయిల్.. సమస్యలన్ని మటుమాయం..

ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..

Health Tips: వీటిని అధికంగా తీసుకుంటున్నారా.. అయితే, మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!