AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-Shram: రైతులు ఈ స్కీమ్‌లో చేరితే రూ.2 లక్షల బెనిఫిట్‌.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు..!

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు కలిగిస్తున్నాయి...

e-Shram: రైతులు ఈ స్కీమ్‌లో చేరితే రూ.2 లక్షల బెనిఫిట్‌.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు..!
Subhash Goud
|

Updated on: Dec 19, 2021 | 4:05 PM

Share

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ ఇశ్రమ్ వెబ్‌సైట్ తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకున్న వారికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారుల ద్వారా సమాచారం.

రూ.2 లక్షల ఉచిత బీమా..

తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా..?

ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. దీని తరువాత మీరు ఆధార్‌తో లింక్ చేయబడిన నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ప్రక్రియను కొనసాగించాలి. మీ సమాచారం తెరపైకి వస్తుంది. మీరు దానిని అంగీకరించాలి.

మీరు సులభంగానే ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఉంటే సరిపోతుంది. సులభంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూఏఎన్ నెంబర్ వస్తుంది.

ఇవి కూడా చదవండి:

సేవింగ్‌ ఖాతాలపై 7% వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..! మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంతో తెలుసా..?

Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో