Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేవింగ్‌ ఖాతాలపై 7% వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..! మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంతో తెలుసా..?

Savings Account: ఎప్పుడు ఏ ఆర్థిక అవసరం ఏర్పడుతుందో తెలియదు కాబట్టి ఉన్నంతలో పొదుపు చేయడం చాలా ముఖ్యం. అయితే వడ్డీ రేట్లు

సేవింగ్‌ ఖాతాలపై 7% వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..! మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంతో తెలుసా..?
Saving
Follow us
uppula Raju

|

Updated on: Dec 19, 2021 | 9:39 AM

Savings Account: ఎప్పుడు ఏ ఆర్థిక అవసరం ఏర్పడుతుందో తెలియదు కాబట్టి ఉన్నంతలో పొదుపు చేయడం చాలా ముఖ్యం. అయితే వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మీరు ఈ బ్యాంకులలో ఖాతా తెరవడం ద్వారా అధిక వడ్డీ రేట్లను పొందవచ్చు. పెద్ద ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి. దీని ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

దీర్ఘకాలంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బ్యాంకును ఎంచుకోవాలి. పెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్, ATM సేవలు అన్ని నగరాల్లో ఉండాలి. పొదుపు ఖాతాపై అధిక వడ్డీ బోనస్ అవుతుంది. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీని చెల్లిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు పొదుపు ఖాతాపై ఉత్తమ వడ్డీ రేటును పొందుతారు.

1. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లోని సేవింగ్స్ ఖాతాపై 7 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంటుంది. దీనికి మినిమమ్‌ బ్యాలెన్స్ రూ.2,000 నుంచి రూ.5,000 మెయింటెన్ చేయాలి.

2. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పొదుపు ఖాతాపై 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.

3. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ. 2,500 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

4. DCB బ్యాంక్ DCB బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాలపై 6.5 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల కంటే ఈ బ్యాంకు అత్యుత్తమ వడ్డీని ఇస్తోంది. ఈ ప్రైవేట్ బ్యాంకులో మినిమమ్‌ బ్యాలెన్స్ రూ.2,500 నుండి రూ.5,000. వరకు ఉండాలి.

5. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లోని సేవింగ్స్ ఖాతాకు 6.25 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. వీటిలో సగటున నెలలో రూ.2,000 మినిమమ్‌ బ్యాలెన్స్ మెయింటెన్‌ చేయాలి.

(గమనిక: ఈ వడ్డీ రేట్లు సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుంచి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, BSEలో లిస్ట్ చేయబడిన ప్రైవేట్ బ్యాంక్‌లు. సాధారణ పొదుపు ఖాతా కోసం కనీస బ్యాలెన్స్ అవసరం. ఇందులో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా ఉండదు. )

24 సిక్స్‌లు 50 ఫోర్లు 637 పరుగులు.. వెంటనే ఆ ఆటగాడికి CSK నుంచి పిలుపొచ్చింది..

మీ డబ్బులు LIC లేదా PPFలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ తేడాలు గమనించండి..

పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?