24 సిక్స్‌లు 50 ఫోర్లు 637 పరుగులు.. వెంటనే ఆ ఆటగాడికి CSK నుంచి పిలుపొచ్చింది..

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ దృష్టి ఇప్పుడు IPL 2022పై ఉంది. దీని కోసం వారు మళ్లీ కొత్త జట్టును సిద్ధం చేస్తున్నారు. అందుకే ఆటగాళ్లపై ట్రయల్స్

24 సిక్స్‌లు 50 ఫోర్లు 637 పరుగులు.. వెంటనే ఆ ఆటగాడికి CSK నుంచి పిలుపొచ్చింది..
Subhranshu Senapati
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2021 | 7:08 PM

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ దృష్టి ఇప్పుడు IPL 2022పై ఉంది. దీని కోసం వారు మళ్లీ కొత్త జట్టును సిద్ధం చేస్తున్నారు. అందుకే ఆటగాళ్లపై ట్రయల్స్ ప్రారంభించింది. T20 కెరీర్‌లో 24 సిక్సర్లు కొట్టిన 24 ఏళ్ల బ్యాట్స్‌మన్‌ని సీఎస్‌కే ట్రయల్స్‌కి పిలిచింది. ఈ బ్యాట్స్‌మెన్ దేశవాళీ క్రికెట్‌లో ఒడిశా జట్టులో సభ్యుడు. అంతేకాదు కెప్టెన్ కూడా చేశాడు అతడి పేరు సుభ్రాంశు సేనాపతి. చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్‌ను ట్రయల్స్‌కి పిలిచినట్లు ఒడిశా క్రికెట్ స్వయంగా ట్వీట్ చేసింది.

ఈ పోస్ట్‌లో ఒడిశా క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి బ్యాటింగ్ శైలిని కూడా పోస్ట్ చేసింది. నిజానికి ఈ రెండు టోర్నీలలో ప్రదర్శన కారణంగా CSK సేనాపతిని ట్రయల్స్‌కి పిలిచింది. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి తన జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 5 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 275 పరుగులు చేశాడు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో T20 ఫార్మాట్‌లో ఆడిన 5 మ్యాచ్‌లలో ఈ సంవత్సరం138 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ ఒడిశా క్రికెటర్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 26 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు, 50 ఫోర్లతో 637 పరుగులు చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌లోనూ సేనాపతి తన సూపర్‌ ఫామ్‌ను నిలుపుకుంటాడని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ధోనీ కెప్టెన్సీలో పసుపు జెర్సీతో ఉన్న ఈ జట్టు ఇప్పటివరకు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి మళ్లీ ఆటగాళ్ల మెగా వేలం ఉంది. అన్ని టీమ్‌లు కొత్త టీమ్‌ని తయారు చేసుకోవాలి. CSK ట్రయల్స్‌ కూడా ఇందులో భాగమే.

Also Read : Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

మీ డబ్బులు LIC లేదా PPFలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ తేడాలు గమనించండి..

పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?

ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..