మీ డబ్బులు LIC లేదా PPFలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ తేడాలు గమనించండి..

LIC, PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడికి ఉత్తమ సాధనంగా పరిగణిస్తారు. ఎక్కువగా రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించి ప్రజలు అందులో

మీ డబ్బులు LIC లేదా PPFలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ తేడాలు గమనించండి..
Lic, Ppf
Follow us
uppula Raju

|

Updated on: Dec 19, 2021 | 8:56 AM

LIC, PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడికి ఉత్తమ సాధనంగా పరిగణిస్తారు. ఎక్కువగా రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించి ప్రజలు అందులో పెట్టుబడి పెడతారు. జీవిత బీమా పాలసీలలో కూడా కొంతమంది రాబడిని దృష్టిలో ఉంచుకుని డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ప్లాన్ మెచ్యూరిటీ అయితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశిస్తారు. LIC అనేది ఒక ఇన్సూరెన్స్‌ పాలసీ. దీనిలో మరణం వంటి దురదృష్టకర సంఘటన తర్వాత నామినీకి డబ్బు వస్తుంది.

పాలసీ తీసుకునే వ్యక్తి పాలసీని అమలు చేస్తున్నంత కాలం, అతను/ఆమె ఆర్థిక భద్రతను పొందుతారు. LIC పాలసీలో మనుగడ ప్రయోజనం ఉంటుంది. దీనిలో మెచ్యూరిటీపై నిర్దిష్ట మొత్తం అందుబాటులో ఉంటుంది. రెండు పథకాలు వాటి సొంత లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో PPF కొన్ని సందర్భాల్లో LIC కంటే మెరుగైనది. దీని గురించి తెలుసుకోవాలంటే రెండింటినీ పోల్చి చూడాల్సిందే.

1. PPF అంటే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్. అయితే LIC ఇన్సూరెన్స్, రిస్క్ ప్రొటెక్షన్. 2. PPFలో సంపాదించిన వడ్డీ సంవత్సరానికి 7.1, ఇది ప్రతి ఏటా కలుపుతారు. LIC రాబడి పాలసీపై ఆధారపడి ఉంటుంది. 4-6 శాతం వరకు ఉంటుంది 3. PPF కాలం 15 సంవత్సరాలు అయితే LIC కాలం మారుతూ ఉంటుంది. ప్లాన్ తీసుకున్న వ్యక్తి దానిని నిర్ణయిస్తాడు 4. పిపిఎఫ్‌లో అకౌంటు ముందస్తుగా మూసివేస్తారు. 5. PPFని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా LICని IRDA నిర్వహిస్తుంది 6. మీరు పీపీఎఫ్‌లో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. LIC ప్రీమియం ఫిక్స్ ఉంటుంది. 7. మీరు 7వ సంవత్సరం నుంచి PPFలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకోవచ్చు. LIC పాలసీకి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు 8. PPF EEE కేటగిరీ కింద వస్తుంది. అంటే పెట్టుబడి, వడ్డీ, రాబడి అన్నీ పన్ను రహితం. మీరు LIC హామీ మొత్తంలో 10% వరకు ప్రీమియంలో చెల్లిస్తే అది పన్ను రహితం. డెత్ బెనిఫిట్‌లో పొందిన డబ్బు కూడా పన్ను రహితంగా ఉంటుంది.

రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం? రిటర్న్‌లను పరిశీలిస్తే PPF 7 శాతం రాబడిని ఇస్తుంది. అయితే LIC 4-6 శాతానికి పెరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడి ముఖ్యమా లేక ఇన్సూరెన్స్‌ ముఖ్యమా నిర్ణయించుకోవాలి. PPF పెట్టుబడిపై రాబడికి హామీ ఇస్తుంది. అయితే LIC ఇన్సూరెన్స్‌ హామీ ఇస్తుంది. PPF మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. LIC మీకు జీవిత బీమాను అందిస్తుంది. కొంత వరకు డబ్బు కూడా హామీ ఇచ్చినప్పటికీ. ఎక్కువ రాబడి మాత్రం రాదు. కానీ సంతృప్తికరమైన మొత్తం అందుతుంది.

టర్మ్ పాలసీ, PPF కుటుంబంలో చాలా మంది ఆధారపడి ఉన్న వ్యక్తులకు ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యమైనది. దీని కారణంగా పాలసీదారుడు ఈ ప్రపంచంలో లేనప్పుడు నామినీకి గణనీయమైన మొత్తం లభిస్తుంది. పీపీఎఫ్‌లో ఇది ఉండదు. PPF మీకు రక్షణ ఇవ్వదు కానీ ఖచ్చితంగా రాబడిని ఇస్తుంది. దీని రాబడితో పోల్చి చూస్తే, LIC తక్కువ రాబడిని ఇస్తూ జీవితానికి రక్షణ ఇస్తుంది. ఇందులో ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. దీనిలో మెచ్యూరిటీ డబ్బు అందుబాటులో ఉండదు కానీ అకాల మరణం సంభవించినప్పుడు నామినీకి అనేక రెట్లు డబ్బు లభిస్తుంది. అందువల్ల పెట్టుబడిదారుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని పీపీఎఫ్‌లో డబ్బును డిపాజిట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీవిత భద్రతతో పాటు ఆర్థిక భద్రత కూడా ఉంటుంది.

పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?

ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

కెనడాలో విచిత్రం.. గర్భిణీలో పిండం కడుపులో కాకుండా లివర్‌లో పెరుగుతుంది..