Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Electric Car: ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగంలో ఎక్కువగా చర్చిస్తున్న విషయం ఎలక్ట్రిక్ వాహనాలు. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Electric Vehicle
Follow us
uppula Raju

|

Updated on: Dec 19, 2021 | 8:07 AM

Electric Car: ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగంలో ఎక్కువగా చర్చిస్తున్న విషయం ఎలక్ట్రిక్ వాహనాలు. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి వాటి అన్ని లక్షణాలను జనాలలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అనేక ఫీచర్ల గురించి ప్రజలకు తెలియజేస్తున్నాయి. మీ ప్రయాణ అనుభవాన్ని మార్చే ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే మొదటి అనుభూతి ఏంటంటే అది పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది. వాస్తవానికి ఎలక్ట్రిక్ మోటార్లు సంప్రదాయ ఇంజిన్‌ల మాదిరి శబ్దం చేయవు వాహనంలో వైబ్రేషన్‌లను సృష్టించవు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ కారులో ప్రయాణించడం కంటే ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అదే సమయంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు నడుస్తున్న ప్రదేశంలో శబ్దం కాలుష్యం బాగా తగ్గుతుంది. మొదటి రైడ్‌లోనే ప్రజలు ఎలక్ట్రిక్, పెట్రోల్-డీజిల్ కారు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుంటారు. ఈ కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడతారని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

సురక్షితమైన డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు సంప్రదాయ ఇంధన కారు కంటే చాలా విధాలుగా సురక్షితమైనవిగా చెప్పవచ్చు. వాస్తవానికి డిజైన్ కారణంగా కారు గురుత్వాకర్షణ కేంద్రం కిందికి వస్తుంది. ఏదైనా మలుపు తిరుగుతున్నప్పుడు కారుని సులువుగా కంట్రోల్ చేయవచ్చు. బ్యాటరీ పగిలిపోవడం లేదా దెబ్బతినడం గురించి ప్రజలకు ఆందోళనలు ఉండవచ్చు. కానీ పెట్రోల్ లేదా డీజిల్‌తో నింపిన ఇంధన ట్యాంకుల కంటే బ్యాటరీలు చాలా సురక్షితమైనవి. అందుకే ఎలక్ట్రిక్ కార్లు సురక్షితంగా ప్రయాణించే అనుభూతిని కలిగిస్తాయి.

ప్రయాణంలో స్వీయ-ఛార్జింగ్ సామర్థ్యం ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలతో నడుస్తాయి. ఇది అనేక అవకాశాలను కల్పిస్తోంది. వాస్తవానికి సంప్రదాయ ఇంధనంలో శక్తి కోసం, మీరు ట్యాంక్‌లో పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వీలుగా కంపెనీలు అన్ని అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం నెక్సాన్ EVతో సహా అనేక ఎలక్ట్రిక్ వాహనాలలో ఫీచర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ ఇస్తున్నారు. ఇందులో కారుకు బ్రేక్ వేసినప్పుడల్లా, సిస్టమ్ ఈ శక్తిని శక్తిగా మార్చుతుంది. బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. దీని కారణంగా కారు డ్రైవింగ్ మెరుగ్గా ఉంటుంది.

కారు నిర్వహణ చాలా తక్కువ ఎలక్ట్రిక్ కార్లు నిర్వహించడం చాలా సులభం. ఇంజన్ ఉండదు. చాలా తేలికైన కదిలే భాగాలను కలిగి ఉంటాయి. బ్యాటరీలు సాధారణంగా ఉండేలా రూపొందిస్తారు. అటువంటి పరిస్థితిలో సాధారణ పెట్రోల్, డీజిల్ కారుతో పోలిస్తే మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇది ఎల్లప్పుడూ ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది.

Traffic Restrictions: మారథాన్ 2021 ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..!

Sai Pallavi: ఫ్యాన్స్ చేసిన పనికి స్జేజ్ పైనే ఏడ్చేసిన సాయి పల్లవి.. నెట్టింట్లో వీడియో వైరల్..

Rai Typhoon: ఫిలిప్పీన్స్‌‌లో ‘’రాయ్‌’’ తుఫాను విధ్వంసం.. 31మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!