AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel: అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ రేటు.. పెట్రోల్, డీజిల్ ధర పెరిగే అవకాశం..!

రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరే ఇందకు కారణం...

Petrol, Diesel: అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ రేటు.. పెట్రోల్, డీజిల్ ధర పెరిగే అవకాశం..!
Crud
Srinivas Chekkilla
|

Updated on: Dec 19, 2021 | 6:58 AM

Share

రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరే ఇందకు కారణం. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీ గోల్డ్‌మన్ సాచ్స్ చెప్పారు.

రానున్న కాలంలో క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతుందని, ధరలు ప్రస్తుత స్థాయి కంటే పైకి కదులుతాయని బ్రోకరేజ్ హౌస్ అంచనా వేస్తోంది. ముడి చమురు డిమాండ్ 2022-2023లో దాని కొత్త రికార్డు స్థాయిని తాకవచ్చు. దీని కారణంగా ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉంది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రోకరేజ్ హౌస్ సీనియర్ అధికారి ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభిస్తున్నాయని చెప్పారు. రానున్న కాలంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య అంతరం ఏర్పడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. .

ఇటీవల, డిమాండ్ విజృంభణ కారణంగా, బ్రెంట్, WTI క్రూడ్ బ్యారెల్‌కు 80 డాలర్లు దాటింది. ఒమిక్రాన్ భయంతో ధర బ్యారెల్ 70 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఒమిక్రాన్ డెల్టా కంటే తీవ్రమైనది కాదని తెలియడంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. కమోడిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే కాలంలో డిమాండ్ పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

భారత్‌ భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో దానిపై విధించే సుంకం ద్వారా ధరలు ఉంటాయి. విదేశీ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగితే దేశీయ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. అయితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో రానున్న కాలంలో ప్రభుత్వం పన్నును నియంత్రించి వినియోగదారులపై ఒత్తిడిని పరిమితం చేసే అవకాశం ఉంది.

Read Also.. Jio vs Airtel vs VI: వార్షిక ప్లాన్ వర్సెస్ నెలవారీ రీఛార్జ్.. ఏది బెటరంటే? ఆ డేటా ప్లాన్‌పై రూ. 1008 ఆదా చేసే అవకాశం..!

దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!